కంగనా చెల్లి అస్సలు తగ్గట్లేదు!!

Update: 2017-10-06 12:26 GMT
హృతిక్ రోషన్-కంగనా రనౌత్ ల మధ్య వ్యవహారం మళ్లీ వేడెక్కిపోయింది. ఈసారి స్వయంగా కంగనా సోదరి రంగోలి ఈ తేనెతుట్టెను గట్టిగానే కదిలించింది. రంగోలి ఇచ్చిన షాక్ తో.. హృతిక్ రోషన్ కూడా స్వయంగా రంగంలోకి దిగి సుదీర్ఘమైన వివరణనే ఇచ్చాడు. ఓ స్టేట్మెంట్ రూపంలో విడుదల చేసినా.. తానేమీ మంచోడిని అనడం లేదని.. అలాగని ఆరోపణలు చేస్తున్నట్లుగా టైపు వ్యక్తి తాను కాదు అన్నది హృతిక్ వెర్షన్.

దీనికి ఓ ఈ-మెయిల్ స్నాప్ షాట్ తో రంగోలి ఇప్పుడు రిటార్ట్ ఇచ్చింది. అదికూడా మామూలు పదజాలంతో కాదు.. బాగా పరుషంగానే తిట్టిపోసింది. హృతిక్ నుంచి కంగనాకు అందినట్లుగా రంగోలి చెబుతున్న ఈ మెయిల్ స్నాప్ షాట్ విడుదల చేయడానికి కారణం.. ఆ ఈమెయిల్ కరెక్ట్ అని చెప్పడం కాదన్నది ఆమె వెర్షన్. ఐపాడ్ నుంచి రాసి పంపిన మెయిల్ అని.. కానీ పోలీసులకు.. ఫోరెన్సిక్ నిపుణులకు మాత్రం తన ల్యాప్ టాప్ ను మాత్రమే హృతిక్ ఎందుకు ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేసింది రంగోలి.

అంతే కాదు.. గతంలోనే సర్క్యులేట్ అయిన ఫోటోను కూడా పోస్ట్ చేసిన రంగోలి.. 'ఈ ఫోటోను ఫోటో షాప్ చేశారని చెబుతున్న మాటలో వాస్తవం ఉందని అనుకుందాం. సరే.. మరి ఆ ఫోటోలో ఆమెను వెనక నుంచి జలగ(క్రీప్)లాగా పట్టుకుని.. మెడ వాసన చూస్తున్నదెవరు హృతిక్.. నువ్వు కాదా' అంటూ నిలదీసింది రంగోలి. అంతే కాదు.. అక్కడ నీ భార్య కూడా ఉందని అంటున్నావు.. మరి నీ ఫ్రెండ్ తో నీ భార్యకు రిలేషన్ ఉన్న సంగతి ప్రపంచానికి తెలుసు కదా.. అవన్నీ దాచేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నావని కూడా రంగోలి ప్రశ్నించింది.
Tags:    

Similar News