లేడి డైరెక్టర్ కింద పనిచేయడట: కంగన

Update: 2018-09-01 12:25 GMT
బాలీవుడ్ క్వీన్ కంగనా కు వివాదాలు కొత్తేమీ కాదు.  హృతిక్ తో గొడవ దగ్గర నుండి మొదలుపెడితే నెపోటిజం చర్చలదాకా ఆమె టచ్ చేయని టాపిక్ లేదు.. వివాదాస్పదం కాని సందర్భం లేదు.  ఇక తాజాగా కంగనా సోను సూద్ విషయం లో చేస్తున్న కామెంట్స్ మరో సారి వివాదాన్ని రాజేసేలా ఉన్నాయి.   'మణికర్ణిక' దర్శకుడు క్రిష్.  'ఎన్టీఆర్' బయోపిక్ తో బిజీ కావడంతో 'మణికర్ణిక' లో మిగిలిన ప్యాచ్ వర్క్ కు కంగన దర్శకత్వం వహిస్తోంది.  ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సోను సూద్ రెండు రోజుల క్రితం ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు.

రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సింబా'లో సోను సూద్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ఆ పాత్ర కోసం గడ్డం పెంచాల్సి వచ్చింది. కానీ 'మణికర్ణిక' లో సోను పాత్ర క్లీన్ షేవ్ తో ఉంటుంది. దీనికి తోడు మణికర్ణిక టీమ్ కు కేటాయించిన కాల్ షీట్స్ కూడా అయిపోయాయట. దీంతో 'మణికర్ణిక' నుండి తప్పుకున్నాడు. ఇక ఈ విషయం పై తీవ్రంగా స్పందించింది కంగనా.  సోను ఒక లేడీ డైరెక్టర్ కింద పని చేయడానికి నిరాకరించాడని ఫైర్ అయింది.

అంతే కాకుండా సోను చేయాల్సిన కాంబినేషన్ సీన్స్ కు సంబంధించి మిగతా యాక్టర్ల డేట్స్ లకు మ్యాచ్ అయ్యేలా రఫ్ డేట్స్ ఇవ్వలేదని ఆరోపించింది. మిగతా టీమ్ మెంబర్స్ అందరూ నా దర్శకత్వంపై నమ్మకం ఉంచినప్పటికీ సోను కు నమ్మకం - డేట్స్ రెండూ లేనట్టుగా ఉన్నాయి అని పంచ్ విసిరింది. సోను ది పురుషాహంకారం అని దుయ్యబట్టింది. మరో వైపు అసలు స్క్రిప్ట్ లో లేని కుస్తీ సీన్లు పెట్టమని ప్రొడ్యూసర్లను అడిగాడని చెప్పింది.  ఆ సీన్స్ కోసం నాలుగు నెలలు కసరత్తులు చేసి బాడీ పెంచాడట. నా వెనక ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు రైటర్లు - నిర్మాతలు ఆ సీన్లు వద్దన్నారు నేనేం చేయను? అని అడిగింది.

ఇదిలా ఉంటె సోను సూద్ సన్నిహితులు మాత్రం సోను ఇరవై ఏళ్ళ కెరీర్లో ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా లేదని - ఎప్పుడూ ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తాడని.. తప్పంతా కంగనాదేనని అంటున్నారు. తన అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ వల్లే ఇలా జరిగిందని చెప్తున్నారు.  ఒకవేళ లేడీ డైరెక్టర్ కింద పనిచేయడం చిన్నతనంగా భావించి ఉంటె గతంలో ఫరా ఖాన్ దర్శకత్వంలో పనిచేశాడు కదా అని గుర్తు చేస్తున్నారు.

ఏంటో కంగన.. వివాదాన్ని ఆమె సృష్టిస్తుందో లేదా ఆమె దగ్గరకు వివాదాలే వెతుక్కుంటూ వస్తాయో ఎప్పుడు హంగామానే. అంతా బాగానే ఉంది కానే ఇం రచ్చ జరుగుతూ ఉంటే మన చిలిపి చిన్నయ్య క్రిష్ నోరు మెదపడే...!
Tags:    

Similar News