నోరు మూసుకున్నా..కనిక చెప్పిన అసలు నిజాలివీ..

Update: 2020-04-27 14:18 GMT
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవలే కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. లండన్ నుంచి వచ్చిన ఆమెకు కరోనా సోకినా పెడచెవిన పెట్టి స్టార్ హోటల్స్ లో దిగి హల్ చల్ చేసింది. పలువురికి వ్యాధి అంటించింది.  కనికా దేశంలో దిగాక చాలా మంది రాజకీయ - సినీ ప్రముఖులను కలిసింది. పలు విందులు - కార్యక్రమాల్లో పాల్గొంది. కనికాకు కరోనా లక్షణాలున్నా పెడచెవిన పెట్టి ఇలా క్వారంటైన్ లో ఉండకుండా తిరిగినందుకు అప్పట్లోనే ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.

కరోనా బారినపడ్డ  బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికాకపూర్ ఎట్టకేలకు ఆ వ్యాధి నుంచి ఇటీవలే బయటపడింది. అయితే అప్పటికే ఆమె దేశ విదేశాల్లో చాలామందితో క్లోజ్ గా ఉండడంతో కరోనా వాహకంగా మారిందనే విమర్శలు వచ్చాయి. దేశంలో మాజీ సీఎం వసుంధర రాజే కుటుంబంలో జరిగిన ఓ విందుకు ఈమె హాజరయ్యారు.

ప్రస్తుతం కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఇంట్లోనే లాక్ డౌన్ పీరియడ్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

కనిక కపూర్ పోస్టు చేస్తూ.. ‘తాను యూకే లో  - ముంబైలో - లక్నోలో కలిసిన వ్యక్తుల్లో ఎవరికి కరోనా వైరస్ పాజిటివ్ రాలేదని.. వారికి నిర్ధారణ పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చిందని’ తెలిపారు. అయితే తనను దోషిగా చూపిస్తూ కథనాలు - కట్టుకథలు అల్లి తనను అభాసుపాలు చేశారని కనిక వాపోయింది. నా నుంచి తప్పు జరిగింది కనుక దాని గురించి మాట్లాడడం లేదన్నారు. నాపై కట్టుకథలు అల్లిన వారు తప్పకుండా పశ్చాత్తాపం పడుతారని కనిక అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News