సినీఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Update: 2021-06-04 06:34 GMT
దేశంలో ఓవైపు కరోనా మహమ్మారితో సతమతం అవుతుంటే మరోవైపు సినీపరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి బి.జయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. 77ఏళ్లు వయసులో జయ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయినట్లు తెలుస్తుంది. 1944లో పుట్టిన జయ.. థియేటర్ ఆర్టిస్టుగా 1958లో భక్త ప్రహ్లాద సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆనాటి నుండి 6 దశాబ్దాలుగా జయ కన్నడ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన సేవలు అందించారు. ఇన్నేళ్లు సినీ కెరీర్ ఆమె దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్నారు.

కానీ కెరీర్ ప్రారంభం నుండి జయ ఎక్కువగా సహాయనటిగా మాత్రమే నటించడం విశేషం. ఆనాటి కన్నడ స్టార్స్ డాక్టర్ రాజ్‌కుమార్ - కళ్యాణ్ కుమార్ - ఉదయ్ కుమార్ - ద్వారకేష్ - బాలకృష్ణ వంటి మొదటితరం నటులతో జయ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా మూవీస్ తర్వాత ఆమె కొన్నేళ్లపాటు టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించారు. 2004-5లో గౌద్రు అనే సినిమాలో నటించి ఉత్తమ సహాయనటిగా కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకుంది. ప్రస్తుతం జయ మరణం కన్నడ ఇండస్ట్రీలో తీరని లోటుగా మారిందని కన్నడ సినీ ప్రముఖులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా కన్నడ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు కన్నుమూశారు. ఇప్పుడు జయ మరణం మరింత బాదిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం మేరకు జయ జూన్ 3న మధ్యాహ్నం 3గంటల సమయంలో మరణించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె మరణం పట్ల సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News