హీరోయిన్ తో మాటామంతీ కోసం హ్యాకింగ్

Update: 2017-01-03 06:12 GMT
సినీ తారలకు సంబంధించి.. ముఖ్యంగా స్టార్లకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతుండడం చూస్తూనే ఉంటాం. రాంగ్ పోస్ట్ లు పడ్డ కొన్ని గంటలకు.. ఎవరో హ్యాకింగ్ చేశారంటూ మళ్లీ క్లారిఫికేషన్ వస్తూ ఉంటుంది. తాజాగా కరీనా కపూర్ ఖాన్ కు చెందిన ఒక అకౌంట్ హ్యాక్ అయింది. అయితే.. ఇది సోషల్ మీడియా అకౌంట్ కాదు.. ఆమె ఇన్ కం ట్యాక్స్ డీటైల్స్ ఉండే ఐటీ సైట్ కు సంబంధించిన అకౌంట్.

కరీనా కపూర్ ఐటీ అకౌంట్ హ్యాకింగ్ కు గురైందనే విషయాన్ని గుర్తించిన ఆమె సీఏ.. వెంటనే కంప్లెయింట్ ఇవ్వడం.. పోలీసులు నిందితుడిని ట్రేస్ చేయడం జరిగిపోయాయి. ఇతను ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కావడం మరీ ఆశ్చర్యకరం. అయితే.. కరీనా అకౌంట్ ను హ్యాక్ చేయడానికి అతను చెప్పిన కారణం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను కరీనా కపూర్ కు వీరాభిమానినని.. ఇలా చేస్తే కనీసం ఒకసారైనా ఆమెతో మాట్లాడే అవకాశం లభిస్తుందని అంటున్నాడు ఆ వ్యక్తి.

అయితే.. అతని ఫోన్ లో చాలానే ఐపీ అడ్రస్ లు ఉన్నాయని అంటున్నారు పోలీసులు. కరీనా ప్యాన్ నెంబర్ ఆధారంగానే ఈ హ్యాకింగ్ జరిగిందనే విషయం పోలీసులు ధృవీకరించారు. ఇతను తన సహోద్యోగులకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలో సాయం చేస్తుంటాడు కానీ.. ఇన్నేసి ఐపీ అడ్రసులతో అతనేం చేస్తాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News