హీరోగారి 100కోట్ల దాహం తీరిందిలే

Update: 2019-11-13 08:46 GMT
త‌మిళ్ హీరో కార్తీ కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ మంచి చిత్రాలైతే ఉన్నాయి గానీ... భారీ వ‌సూళ్లు తెచ్చిన సినిమాలు పెద్ద‌గా లేవు. 50కోట్ల గ్రాస్ రేంజ్ కూడా క‌ష్ట‌మైంది. క‌మ‌ర్శియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే 30-40కోట్ల లోపే. దీంతో ఆ వెలితి కార్తీలో ఎప్ప‌టి నుంచో ఉంది. తాజాగా ఖైదీతో బ్లాక్ బ‌స్ట‌ర్ వెలితి తీరింది. అంతేకాదు.. ఈ సినిమా త‌మిళంలో పెద్ద స‌క్సెస‌వ్వ‌డంతో 100కోట్ల‌ దాహం కూడా తీరిన‌ట్ట‌య్యింది. ఇటీవ‌ల విజ‌య్ క‌థానాయ‌కుడిగా  న‌టించిన బిగిల్ కి పోటీగా విడుద‌లైన ఖైదీ .. ఆ సినిమాను మించి భారీ స‌క్సెస్ సాధించిన‌ట్లు  బాక్సాఫీస్ గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ఖైదీ 100 కోట్ల క్ల‌బ్ లో చేరిన‌ట్లు యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది.  దీంతో కార్తీ  కెరీర్ లోనే తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చిందంటూ అభిమానుల్లో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. 40 కోట్ల బ‌డ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. తెలుగు-త‌మిళ్ భాష‌ల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండానే విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేయ‌డం విశేషం. ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి ఈ మొత్తం వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఒక్క త‌మిళ‌నాడు లో 50 కోట్లు వ‌సూళ్లు సాధించ‌గా.. బ్యాలెన్స్  మొత్తాన్ని తెలుగు రాష్ట్రాలు.. క‌ర్ణాట‌క‌- కేర‌ళ నుంచి రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్- బెంగ‌ళూరు వంటి మెట్రోల్లోనూ ఖైదీ అసాధార‌ణ వ‌సూళ్లు సాధించింది. బిగిల్ త‌మిళ‌నాట ఏకంగా 600 పైగా థియేట‌ర్ల‌లో రిలీజైత ఖైదీ కేవ‌లం 300 థియేట‌ర్ల‌లోనే రిలీజై అంత పెద్ద విజ‌యం సాధించ‌డంపైనా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈ దీపావ‌ళి విన్న‌ర్ ఖైదీ అన్న ముచ్చ‌టా సాగుతోంది.

ఈ సినిమా తెలుగు హ‌క్కుల్ని 4.5 కోట్ల‌కు ద‌క్కించుకున్న పంపిణీదారుకు బాగానే లాభాలొచ్చాయ‌ట‌. ఇక ఖైదీకి సీక్వెల్ గా 'దిల్లీ-2' బ‌రిలో దిగుతాడ‌ని ఇప్ప‌టికే  ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ ప్ర‌క‌టించాడు. తాజా వ‌సూళ్ల నేప‌థ్యంలో దీల్లి-2పై మ‌రింత ఎఫర్ట్ పెట్టే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం కార్తీ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు.
Tags:    

Similar News