స్టార్ డాట‌ర్ ప్రేమ వ్య‌వ‌హారంపై ఫ్యాన్స్ లొల్లి

Update: 2020-02-09 03:30 GMT
సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్-య‌వ న‌టుడు కార్తీక్ ఆర్య‌న్ `ల‌వ్ ఆజ్ క‌ల్ -2` సీక్వెల్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెట్స్ లో ఆ ఇద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌ని బాలీవుడ్ లో వ‌రుస‌ క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఒక‌రిని వీడి ఒక‌రు ఉండ‌లేనంత డీప్ ల‌వ్ లో ఉన్నార‌ని ఉత్త‌రాది మీడియా కోడై కూస్తుంది. అయితే మామ‌ధ్య ఉన్న‌ది కేవ‌లం స్నేహం మాత్ర‌మే.. ప్రేమలో ప‌డ‌లేద‌ని సారా ఇప్ప‌టికే ఖండించంది. అయినా ఈ త‌ర‌హా క‌థ‌నాల‌కి మాత్రం బ్రేక్ ప‌డ‌లేదు. మ‌రోసారి ఈ జంట మీడియాకి అడ్డంగా దొరికి పోయారు. `ల‌వ్ ఆజ్ క‌ల్ -2` రిలీజ్ లో భాగంగా ద‌ర్శ‌కుడు ఇంతియాజ్ అలీతో క‌లిసి ఆ ఇద్ద‌రూ ప్ర‌చారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

అయితే ముంబైలో `ల‌వ్ ఆజ్ క‌ల్ 2` ప్ర‌చారంలో ఓ గమ్మ‌త్త‌యిన స‌న్నివేశం అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. ప్రెస్ మీట్ వెన్యూ వ‌ద్ద‌కు.. సారాని కార్తిక్ ఆర్య‌న్ త‌న రెండు చేతుల‌తో ఎత్తుకుని తీసుకొచ్చి మీడియా స‌హా అభిమానుల‌ను స‌ర్ ప్రైజ్ చేసాడు. ఆ స‌మ‌యంలో సారా ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతూ నిజ‌మైన చెలికాడి ఒడిలో వాలిపోతే ఎలాంటి అనుభూతికి లోనవుతారో అలాంటి దృశ్యాన్నే ఆవిష్క‌రించింది. ఆ సీన్ చూశాక‌.. అభిమానులు ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియా లో చెల‌రేగి పోయారు. పెళ్లి కాకుండానే ఆ ఇద్ద‌రు బెస్ట్ క‌పుల్‌ లా జీవించేస్తున్నార‌న్న వ్యాఖ్య‌లు వినిపించాయి.

పెళ్లి జ‌రిగిన త‌ర్వాత ఇంకెంత అన్యోన్యంగా ఉంటారో అంటూ ప‌లువురు నెటిజ‌నులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే మీ ప్రేమ‌కు సాక్ష్యం! అంటూ ఫ్యాన్స్ క‌న్ఫామ్ చేసేశారు. ప్రేమ లేదంటూనే ప‌బ్లిక్ గా ఇవేం ప‌నులు అంటూ? కొంద‌రు కొంటెగా కామెంట్ చేశారు. అయితే ఇదంతా ల‌వ్ ఆజ్ క‌ల్ 2 ప్ర‌చారంలో భాగంగా చోటు చేసుకున్న స‌న్నివేశం మాత్ర‌మే. కానీ నెటిజ‌నులు ఊరుకుంటారా? త‌మ ప్ర‌తాపం చూపించేందుకు ఏమాత్రం వెన‌కాడ‌లేదు. అక్క‌డ అదే జ‌రిగింది. మ‌రి దీనికి సారా స్పందించాల్సిన అవ‌స‌రం లేదేమో!
Tags:    

Similar News