60 దగ్గర ఆగిపోతున్న కాటమరాయుడు

Update: 2017-04-04 04:06 GMT
పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీ ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. టీజర్ తర్వాత జనరేట్ అయిన క్రేజ్ ను చూసి.. మెగాభిమానులకు ఉగాది పండుగ కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం.. టాలీవుడ్ లో వంద కోట్ల వసూళ్లను సాధించేస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న కాటమరాయుడు.. ఆ తర్వాత మరింతగా డల్ అయిపోయాడు.

మొదటి వారం ముగిసేసరికి 55 కోట్ల షేర్ వసూలు చేసి.. ఇండస్ట్రీలో టాప్5 లో చోటు సంపాదించినా.. కాటమరాయుడు సక్సెస్ పై అనుమానాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడవే నిజమయ్యాయి కూడా. రెండో వారాంతంలో మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేయగా.. కొత్త సినిమాల తాకిడి కారణంగా ఆ ఆశలు కూడా నెరవేరలేదు. సెకండ్ వీకెండ్ ముగిసేసరికి.. మొదటి పది రోజులకు గాను కాటమరాయుడు ప్రపంచవ్యాప్తంగా 58.8 కోట్ల దగ్గర మాత్రమే నిలిచాడు.

ఉత్తరాంధ్ర 6.01 కోట్లు.. ఈస్ట్ 5.14 కోట్లు.. వెస్ట్ 4.09 కోట్లు.. కృష్ణా 3.47 కోట్లు.. గుంటూరు 4.72 కోట్లు.. నెల్లూరు 1.99 కోట్లు.. సీడెడ్ లో 7.75 కోట్లు.. నైజాంలో 14.20 కోట్ల షేర్ రాబట్టి.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 47.37 కోట్ల షేర్ సాధించింది పవన్ లేటెస్ట్ మూవీ. యూఎస్ ఏ లో 3.33 కోట్లకు పరిమితం కాగా. కర్నాటకలో 5.25 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 1.35 కోట్లు.. రెస్టాఫ్ వరల్డ్ 1.50 కోట్లు వసూలు కాగా.. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 58.8 కోట్ల షేర్ వసూలైంది.

కాటమరాయుడుని హిట్ అనాలంటే 87.5 కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది. కనీసం యావరేజ్ గా పరిగణించాలన్నా 70 కోట్ల వసూలవాల్సిందే. ఇప్పుడున్న స్పీడ్ లో మరో 2-3 కోట్లు వస్తేనే ఎక్కువ అంటున్నారు ట్రేడ్ జనాలు. సర్దార్ తర్వాత పవన్ ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లే అని తేల్చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News