బాలయ్య వందో సినిమాకు కేసీఆర్ కొబ్బరికాయ కొట్టారు

Update: 2016-04-22 05:36 GMT
తెలుగు చలన చిత్రపరిశ్రమ ఎంతో ఆసక్తికరంగా చూస్తున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభ వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి రాజకీయ.. సినీ రంగ అతిరథ మహారధులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విచ్చేయటమే కాదు.. తన స్వహస్తాలతో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించటం విశేషం.

అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. రాఘవేంద్రరావు.. సింగీతం శ్రీనివాసరావులు కథను తమ చేతుల మీదుగా ముఖ్యమంత్రి కేసీఆర్.. బాలకృష్ణలకు అందజేయటంతో ఈ సినిమా అధికారికంగా షురూ అయ్యింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు ముహుర్తం షాట్ గురించి చెబుతున్న వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాప్ కొట్టగా 10.26 గంటలకు మొదటి దృశ్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
Tags:    

Similar News