బాలయ్యను కోర్కె తీర్చాలన్న కేసీఆర్

Update: 2016-04-22 05:40 GMT
బాలయ్య వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ప్రారంభం సందర్భంగా విశిష్ఠ అతిధిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. మరీ.. ముఖ్యంగా తనదో కోరిక ఉందని.. దాన్ని తీర్చాలంటూ బాలకృష్ణను కేసీఆర్ అడిగారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నోటి నుంచి ఏం కోరిక రానుందన్న ఆసక్తి వ్యక్తమైంది.

దీనికి తెర దించుతూ కేసీఆర్ తన కోరికను చెబుతూ.. ‘‘ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక.. తొలిసారి వేసే షోకి నన్ను పిలవాలని కోరుకుంటున్నా. ఇది చారిత్రక సినిమా. ఈ సినిమా షోను కుటుంబ సమేతంగా వచ్చి చూస్తా. ఈ వేదిక మీదున్న బ్యాచ్ అంతా ఆ మొదటిషోను చూడాలి. ఆ మొదటి బ్యాచ్ లో నేనూ ఉండాలె’’ అంటూ చారిత్రక సినిమాల మీద తనకున్న మక్కువను బయటపెట్టారు కేసీఆర్.
Tags:    

Similar News