గౌతమి పుత్ర శాతకర్ణి చిన్నవిషయం కాదన్న కేసీఆర్

Update: 2016-04-22 05:42 GMT
బాలయ్య నూరో చిత్రం ‘‘గౌతమి పుత్ర శాతకర్ణి’’ ప్రారంభోత్సవానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను బాలకృష్ణ తన వందో సినిమాగా ఎంపిక చేసుకోవటం అంత చిన్న విషయం కాదని వ్యాఖ్యానించారు. ఒక యుగానికి నాంది పలికిన గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం తీయటం తెలుగువారందరికి గర్వించే విషయంగా చెప్పారు.

బాలకృష్ణ వందో సినిమా రెండు వందల రోజులు ఆడాలన్న ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలై తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలుగు ప్రజలు.. అన్ని తరాల వారు తప్పకుండా చూడాల్సిన చిత్రం.. గౌతమి పుత్ర శాతకర్ణిగా ఆయన అభివర్ణించారు
Tags:    

Similar News