కక్కలేక మింగలేక అన్నట్లుంది మలయాళ భామ కీర్తి సురేష్ పరిస్థితి. ఆమెకు రెండు మంచి అవకాశాలు వచ్చాయి కానీ.. ఆ అవకాశాల్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో అర్థం కావడం లేదు. నేను శైలజ.. నేను లోకల్ లాంటి సూపర్ హిట్లతో టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కీర్తి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రానున్న సినిమాకు హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహానటి సావిత్రి జీవిత కథతో రానున్న సినిమాలోనూ ఆమెకు లీడ్ రోల్ దక్కింది. ఐతే ఈ రెండు సినిమాలూ ఒకేసారి సెట్స్ మీదికి వెళ్తుండటంతో వచ్చింది సమస్య.
కీర్తి రెగ్యులర్ హీరోయిన్ల కంటే కొంచెం ఎక్కువ బరువుందన్నది ఆమె విషయంలో వస్తున్న కంప్లైంట్. ఈ నేపథ్యంలో పవన్ పక్కన ఇలా కనిపిస్తే కుదరదని.. కొంచెం సన్నబడాలని త్రివిక్రమ్ ఆమెకు చెప్పినట్లు సమాచారం. ఆల్రెడీ ఆ దిశగా కీర్తి వర్కవుట్స్ మొదలుపెట్టినట్లు సమాచారం. ఐతే ఇంతలోనే సావిత్రి సినిమా తెరమీదకు వచ్చింది. అందులో లీడ్ రోల్ కోసం కీర్తి కొంచెం బొద్దుగానే కనిపించాలి. అప్పుడే సావిత్రి పాత్రకు ఆమె సూటవుతుంది. నిజానికి సావిత్రి పాత్రకు కీర్తిని ఎంచుకోవడానికి కీర్తి బొద్దుగా ఉండటం కూడా ఒక కారణమే. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలూ ఒకేసారి సెట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉండటంతో కీర్తి తన బాడీని ఎలా మెయింటైన్ చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయింది. మరి ఆమె ఏం చేస్తుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/