బాల‌య్య కోసం కీర్తిని ఒప్పిస్తారా?

Update: 2019-12-07 05:16 GMT
వెట‌ర‌న్ స్టార్ల‌కు క‌థానాయిక‌ల్ని వెత‌క‌డం అంత సులువేమీ కాద‌న్న టాక్ వినిపిస్తోంది. సీనియ‌ర్ల‌తో న‌టిస్తే యంగ్ హీరోలు అవ‌కాశాలివ్వ‌డం లేదు. అందుకే మ‌న‌ హీరోయిన్లు ఎవ‌రూ వెట‌ర‌న్ హీరోల‌కు ఓకే చెప్ప‌డం లేద‌న్న టాక్ ఉంది. సీనియ‌ర్ల స‌ర‌స‌న న‌టిస్తే ఆ ప్ర‌భావం కెరీర్ ని వెంటాడుతుంద‌ని యువ‌క‌థానాయిక‌లు భావిస్తున్నార‌ట‌. అందుకే భామ‌ల‌ కోసం చాలానే సెర్చ్ చేయాల్సి వ‌స్తోంది.

ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక కోసం బోయ‌పాటి సెర్చింగ్ లో ఉన్నార‌ట‌. మ‌హాన‌టి ఫేం కీర్తి సురేష్ కి ఇప్ప‌టికే స్క్రిప్టు ను వినిపించిన బోయ‌పాటి త‌న‌నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే కీర్తి కోసం బోయ‌పాటి చెన్న‌య్ వెళ్లి వ‌చ్చారు. కానీ ఇంకా త‌న నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేద‌ట‌. కీర్తి ఓకే అంటే చిత్ర‌బృందం ఖుషీ అవుతుంది. లేదంటే మ‌రో నాయిక‌ను వెత‌కాల్సిన స‌న్నివేశం ఉంటుంది. ఇక ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న ఎందరు క‌థానాయిక‌లు అవ‌స‌రం అన్న‌ది బోయ‌పాటి రివీల్ చేయాల్సి ఉంటుంది.

మ‌రోవైపు `కైజీఎఫ్ 2`లో అధీరా పాత్ర‌లో న‌టిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ ను ఎన్ బీకే 106 లో విల‌న్ గా న‌టించాల్సిందిగా బోయ‌పాటి సంప్ర‌దించార‌ని ప్ర‌చార‌మైంది. మున్నాభాయ్ అంగీక‌రించారా లేదా? అన్న‌ది రివీల్ చేయాల్సి ఉంది. డిసెంబ‌ర్ 6న సినిమా మొద‌లైంది. ఈ నెలాఖ‌రున రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభించి నిర్విరామంగా షెడ్యూల్స్ పూర్తి చేస్తార‌ట‌. 2020 వేస‌వి లో రిలీజ్ చేయాల‌న్నది ప్లాన్. అందుకు త‌గ్గ‌ట్టే బోయ‌పాటి బృందం ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింది. ఈ భారీ చిత్రాన్ని మిరియాల ర‌వీంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.


Tags:    

Similar News