కెల్లీ బ్రూక్.. ఈ పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా కుర్రాళ్లంతా వణికిపోతున్నారు. ముందు ఆమె ఫొటో చూసి కుర్రాళ్ల గుండెలు లయతప్పుతున్నాయి. ఆ తర్వాత ఆబగా ఆ అందాల్ని డౌన్ లోడ్ చేసి.. సిస్టమ్ కి అంటుకున్న వైరస్ చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇంటర్ నెట్ లో మోస్ట్ డేంజరస్ ఉమన్ గా పేరు తెచ్చుకున్న కెల్లీ బ్రూక్ గురించి తెలుసుకుందాం పదండి.
ఇంకో రెండు నెల్లలో 36 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న కెల్లీ బ్రూక్ మోడల్ గా, శృంగార తారగా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరే సంపాదించింది. ఐతే కళ్లు చెదిరే ఆమె ఒంపు సొంపుల్ని ఎరగా వేసి.. కుర్రాళ్లకు షాకులిస్తున్నారు హ్యాకర్లు. కెల్లీ ఫొటో ను క్లిక్ చేస్తే చాలు.. ఆ సిస్టంలో వైరస్ అటాక్ అయిపోతుంది.
కెల్లీ బ్రూక్ కి ఉన్న క్రేజును వాడుకుని.. కుర్రాళ్ల కంప్యూటర్లను తమ గుప్పెట్లోకి తీసుకోవడానికి హ్యాకర్లు చేసిన ప్లాన్ ఇది. ముందు వైరస్ వదిలి.. ఆ తర్వాత సిస్టంని హ్యాక్ చేసి.. డేటా మొత్తం లాగేయడానికి, డబ్బులు దండుకోవడానికి హ్యాకర్లు చేస్తున్న ప్రయత్నమిది. కెల్లీ బ్రూక్ తో పాటు ఫెర్నాండెజ్ వెర్శిని - డచ్ డాన్స్ డీజే ఆర్మిన్ వాన్ బూరెన్ లతో కూడా ఇలాంటి డేంజరే ఉందట. హ్యాకర్లు కొన్ని వందల ఫొటోల్ని కావాలనే ఇంటర్నెట్లో వదిలారు. కాబట్టి కెల్లీని చూసే కళ్లు కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటర్.