కోలార్ గ‌నుల మాఫియా అరాచ‌కాలు చూసేదెపుడు?

Update: 2021-06-20 05:48 GMT
రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ -1` పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 180 కోట్లు వ‌సూలు చేసింది. క‌న్న‌డ రంగంలో రికార్డుల్ని బ్రేక్ చేయ‌డ‌మే గాక‌.. ఓవరాల్ గా 380కోట్లు వ‌సూలు చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అందుకే ఇప్పుడు కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 పై దేశ‌వ్యాప్తంగా అసాధార‌ణ క్రేజు నెల‌కొంది.

అంతా స‌వ్యంగా సాగితే ఈపాటికే ఈ చిత్రం అభిమానుల ముందుకు వ‌చ్చేది. కోలార్ బంగారు గ‌నుల మాఫియాని ఎదిరించే వాడిగా రాఖీభాయ్ అసాధార‌ణ యాక్ష‌న్ విన్యాసాల‌ను వీక్షించే అవ‌కాశం ద‌క్కేది. కానీ సెకండ్ వేవ్ క‌ల్లోలంలో థియేట‌ర్లు ఎప్ప‌టికి తెరుచుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. నెమ్మదిగా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుతున్నా.. థియేట‌ర్ల‌లో వంద‌శాతం ఆక్యుపెన్సీకి అవ‌కాశం ఎప్పుడు క‌లుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ ప‌రిస్థితిలో రిలీజ్ తేదీపై ప్ర‌శాంత్ నీల్ -హోంబ‌లే బృందాల్లో ఇంకా డైల‌మా అలానే కొన‌సాగుతోంద‌ని స‌మాచారం.  జూలై 16న రిలీజ్ చేస్తామ‌ని డేట్ ని ఇంత‌కుముందు ప్ర‌క‌టించారు. అయితే అప్ప‌టికి వంద‌శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లను తెరుస్తారా?  లేక 50శాతంతోనే ర‌న్ చేస్తారా? అన్న‌దానిపై స‌రైన క్లారిటీ లేదు. ఒక‌వేళ జూలై రిలీజ్ ని వ‌దులుకుంటే త‌ప్ప‌నిస‌రిగా ఆగ‌స్టు 15న రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే అన్ని డైల‌మాల‌పైనా క్లారిటీ ఇచ్చేందుకు రాఖీ భాయ్ టీమ్ మీడియా ముందుకు వ‌స్తుందేమో చూడాలి.
Tags:    

Similar News