ఓ కన్నడ సినిమా దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఆడుతుందని ఎవరూ ఊహించనిది. బడ్జెట్ పరిమితుల మధ్య ఎక్కువగా రీమేకుల మీద ఆధారపడే శాండల్ వుడ్ లో కేజిఎఫ్ కొత్త ఊపిరి ఇచ్చింది. జాతీయ స్థాయిలో ఉనికిని చాటుకునేలా చేసింది. అలా అని ఇదేమి మాస్టర్ క్లాసిక్ కాదు. కేవలం హీరోయిజం ఎలివేషన్ మీద తెరమీద ఎప్పుడు చూడని బంగారు గనుల నేపద్యంలో రావడంతో ప్రేక్షకులు కాస్త కొత్తగా ఫీలవుతున్నారు. ఆశించిన స్థాయిలో కథా కథనాలు ఉండి ఉంటె దీని రేంజ్ ఇంకోలా ఉండేది.
అయినా కూడా వసూళ్ళ పరంగా తనతో పోటీగా నిలిచిన మిగిలిన వాటి కంటే కేజిఎఫ్ బెటర్ గా ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో వీక్ ఎండ్ కు 2 కోట్ల పై చిలుకు షేర్ రాబట్టడం అంటే మాటలు కాదు. అంతో ఇంతో మంచి గుర్తింపు ఉన్న ఉపేంద్ర లాంటి హీరోలే తమ డబ్బింగులతో ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. అలాంటిది ఇంకా పాతిక సినిమాలు కూడా పూర్తి కాని మనకసలు పరిచయమే లేని యష్ కు ఇంత మార్కెట్ రావడం అంటే మాటలు కాదు. ఇది ఫస్ట్ చాప్టర్ కాబట్టి కీలకమైన మలుపులన్నీ రెండో భాగం కోసం దాచేసారు. అలా కాకుండా మొత్తం ఒక పార్ట్ లోనే చూపించి ఉంటే కన్నడ బాహుబలి అనే మాట సార్థకం అయ్యేదేమో.
అయితే బయ్యర్లు మాత్రం దీని ఒక్క విషయంలోనే కొంత రిలీఫ్ గా ఉన్నారు. పడి పడి లేచే మనసు అంతరిక్షం వీక్ గా ఉండటం దీనికి ప్లస్ అవుతోంది. ఎంత మేర నిలుస్తుంది అనేది వేచి చూడాలి. ఈ వారం మరో నాలుగు సినిమాలు ఉన్నా అన్ని బడ్జెట్ వే కావడంతో కేజిఎఫ్ ను దాటేసి పోయేంత సీన్ ప్రస్తుతానికి కనిపించడం లేదు. సో ఎలా చూసుకున్నా కెజిఎఫ్ టాక్ తో సంబంధం లేకుండా సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది