2016 లో ఎంఎస్ ధోని సినిమాతో హీరోయిన్ గా కియారా అద్వానీ గుర్తింపు దక్కించుకుంది. అందకు ముందు కియారా అద్వానీ చాలా స్టగుల్ అయ్యింది. ధోనీ సినిమా తర్వాత ఈ అమ్మడు వెనుదిరి చూసుకోకుండా ఆఫర్లు దక్కాయి. తెలుగు లో ఈమె మహేష్ బాబుకు జోడీగా భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఆ సినిమా కు ఈమె కాస్త అటు ఇటుగా 75 లక్షల వరకు పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లో బిజీగా ఉన్నా కూడా రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించేందుకు సిద్దం అయ్యింది. బోయపాటి ఆ సినిమాకు గాను కియారాకు దాదాపుగా కోటి రూపాయల పారితోషికం ఇచ్చారు అనేది టాక్ ఆ సినిమా ప్లాప్ తో టాలీవుడ్ లో మళ్లీ కనిపించలేదు.
వినయ విధేయ రామ విడుదల అయ్యి రెండున్నర ఏళ్లు అయ్యింది. ఈ రెండున్నర ఏళ్లలో బాలీవుడ్ లో ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా తెలుగు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ అయిన కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది. నటిగానే కాకుండా అందంతో కూడా ఆకట్టుకోగల సత్తా ఉన్న ముద్దుగుమ్మ అంటూ కియారా కు మంచి పేరు వచ్చింది. బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న కియారా అద్వానీ అక్కడ సినిమాను బట్టి ఇచ్చే డేట్లను బట్టి మూడు నుండి నాలుగు కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటుంది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కు జోడీగా మరోసారి కియారా అద్వానీ నటించేందుకు సిద్దం అయ్యింది. ఇటీవలే చరణ్ మూవీలో కియారా నటించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కు గాను శంకర్ కియారాకు దాదాపుగా రూ. 5 కోట్ల ను పారితోషికంగా ఇస్తున్నాడని తెలుస్తోంది.
శంకర్ సినిమా అంటే బల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది.. కాస్త రిస్క్ ఎక్కువ చేయాలి. అంతే కాకుండా షూటింగ్ కు ఏ సమయంలో రావాలంటే ఆ సమయంలో ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు డేట్లు కేటాయించాల్సి వస్తుంది. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తే రెండు మూడు సినిమాలకు వర్క్ చేసినంత అనుభవం వస్తుందని అంటూ ఉంటారు. అంటే అంతగా ఆయన వద్ద వర్క్ ఉంటుందని కొందరి అభిప్రాయం. అందుకే చరణ్ మూవీ లో నటించేందుకు గాను ఈమెకు అయిదు కోట్లు ముడుతున్నాయని అంటున్నారు. తెలుగు లోనే కాకుండా ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకోవడంతో పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ అమ్మడి వల్ల చరణ్ మూవీకి అక్కడ మరింతగా బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న కారణంగా ఖచ్చితంగా ఈ సినిమా కూడా సెంటిమెంట్ ప్రకారం విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కొందరు వినయ విధేయ రామ సెంటిమెంట్ పునరావృతం అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాని శంకర్ పేరు ముందు సెంటిమెంట్స్ అన్ని కూడా పక్కకు తప్పుకోవాల్సిందే. కనుక శంకర్.. చరణ్ ల మూవీ బ్లాక్ బస్టర్ విజయం ఖాయం అనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు.