రెండు భాగాల ఐడియా బాలయ్య గారిదే: క్రిష్

Update: 2019-02-21 06:05 GMT
ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' శుక్రవారం రిలీజ్ అవుతోంది.  ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. బయట ప్రచారంలో ఉన్న రూమర్లపై స్పందించాడు.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన వల్లే ఎన్టీఆర్ బయోపిక్ ఇలా తయారైందని.. ఈ ఐడియా క్రిష్ ఇచ్చిందేనని ప్రచారం సాగుతోంది. ఈ విషయం గురించి అడిగితే "నేను ఈ ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ లోకి రాకమునుపే ఆ ఆలోచన ఉంది. ఒక భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం.. రెండో భాగంలో ఆయన రాజకీయ పయనం కవర్ చేయాలన్న ఐడియా బాలయ్య గారు ఇచ్చిందే" అని చెప్పాడు.  దీంతో క్రిష్ ఎంట్రీ తర్వాతే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా మారిందన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టే.

ఈ సినిమాలో 40% బాలయ్య డైరెక్ట్ చేశారని.. బాలయ్య క్రిష్ మధ్యలో విభేదాలు తలెత్తాయని అంటున్నారు అని అడిగితే అవన్నీ రూమర్లని కొట్టిపారేశారు క్రిష్.  "అలాంటి రూమర్లను ఎవరు పుట్టించారో తెలియదు కానీ బాలయ్యగారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు.  మా మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.   నిజానికి అందరి అంచనాలను 'మహానాయకుడు' మించిపోతుందని నమ్మకం ఉంది" అన్నారు. 
Tags:    

Similar News