నాని డ్యూయల్ రోల్ చేసిన కృష్ణార్జున యుద్ధం ఓపెనింగ్స్ పరంగా ఆశించిన భీభత్సం సృష్టించలేదు కాని డివైడ్ టాక్ మాత్రం బాగానే ప్రభావం చూపిస్తోంది. ఓ మోస్తరుగా ఉన్నా తన ఇమేజ్ తో హౌస్ ఫుల్ చేయించే నానికి ఇది కొంచెం స్పీడ్ బ్రేకర్ లా మారింది అని చెప్పొచ్చు. దానికి నిదర్శనమే కోత. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే పాట అనవసరంగా ఇరికించినట్టు ఉండటమే కాక ఫ్లోని దెబ్బ తీసేలా ఉండటంతో థియేటర్స్ నుంచి ఆ సాంగ్ ని లేపెసారు. నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన నేపధ్యంలో దాన్ని తీసేయడమే ఉత్తమమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అది నిన్నటి నుంచే అమలులోకి వచ్చేసింది. నాని ముందు నుంచి ఊహించినట్టే రిస్క్ తీసుకున్నట్టే అనిపిస్తోంది. ఇప్పుడొచ్చిన డివైడ్ టాక్ ని దాటుకుని నిలబడే లోపే మహేష్ భరత్ అనే నేను వచ్చేస్తుంది. పైగా రంగస్థలం 50 రోజుల దాకా నిలబెట్టాలని చాలా చోట్ల డిసైడ్ అయ్యారు. నిజంగానే స్ట్రాంగ్ గా ఉండటం దీనికి కారణం.
నాని మేర్లపాక గాంధీ కాంబినేషన్ కాబట్టి సినిమా ఆద్యంతం కామెడీ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ మరీ సీరియస్ గా సాగడం ఊహించిన మలుపులే ఉండటం కొంత దెబ్బ తీసినట్టు స్పష్టమైంది. రెండు పాటలు మినహాయించి మిగిలినవన్నీ సోసోగానే ఉండటంతో అది కూడా తేడా కొట్టేస్తోంది. కాకపోతే కృష్ణా పాత్రలో నాని కామెడీ టైమింగ్ ఫస్ట్ హాఫ్ మరీ బోర్ కొట్టకుండా సాగించడం చాలా మటుకు కాపాడింది. ఆశించిన వసూళ్ళలో ఎంసిఎతో పోల్చుకుంటే నలభై శాతం తక్కువే తెచ్చిన కృష్ణార్జునులు మరి పాట కత్తిరించాక వేగం పెంచుతారేమో చూడాలి. ఈ ఏడాది తమిళ సంగీత దర్శకులు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. అనిరుద్ రవిచందర్ ఏడాది ప్రారంభంలో నిరాశ కలిగిస్తే హిప్ హప్ తమిజా కూడా అతని తరహాలోనే రెండు పాటలు మాత్రమే క్లిక్ అయ్యేవి ఇవ్వడం వింతే