దేశవ్యాప్తంగా సంచలనం రేపిన యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో నిందితులకు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేసారు. సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందనే ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద రియాతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తిని ముంబై లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రియాని ఆర్థిక లావాదేవీలపై సుమారు 8 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు షౌవిక్ చక్రవర్తిని 18 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.
ఇదిలా ఉండగా ఈడీ విచారణకు రియా హాజరైన నేపథ్యంలో సుశాంత్ మాజీ ప్రియురాలు కృతి సనన్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ''మబ్బులు పట్టి ఉన్నాయి. మంచు పరచుకొని ఉంది. దీని వల్ల అంతా అస్పష్టంగా కనిపిస్తోంది. కానీ నిజం అన్నది సూర్యుడి లాంటిది అని చెప్తున్నాయి. అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. అందుకే దీన్ని ఊహించకండి. ఓపికగా ఎదురు చూడండి. కాసేపు గాలి వీస్తూ ఉండొచ్చు. కొన్ని సార్లు వర్షం కురవొచ్చు. గుర్తుంచుకో మై ఫ్రెండ్.. సూర్యుడు మళ్లీ ప్రకాశవంతం అయ్యేందుకు తుఫాను దారి ఇస్తుంది'' అని కృతి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సుశాంత్ కేసులో జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి నిజానిజాలు బయటకి వచ్చి న్యాయం జరుగుతుందని.. అప్పటి వరకు ఓపికగా ఉండమని కృతి పోస్ట్ చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.