ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా ఈ అమ్మడికి ఏ రేంజ్ లో సక్సెస్ ను తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే వంద కోట్లు దక్కించుకున్నందుకు గాను ఈమె టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఈ అమ్మడు తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తోంది.. చేయబోతుంది. ఇప్పటికే ఈమె చేతిలో కేవలం తెలుగు సినిమాలే అరడజను వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఈమె మరిన్ని సినిమాలను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కృతి శెట్టి ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను కూడా చేసేందుకు గాను సిద్దం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాణ రంగంలో ప్రవేశించిన విషయం తెల్సిందే.
ఆమె ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఆమె నిర్మాణ సంస్థ నుండి మరిన్ని వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలు కూడా రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వెబ్ సిరీస్ లు మరియు సినిమాలను నిర్మించేందుకు ఒక టీమ్ ను సుష్మిత ఏర్పాటు చేసిందట. తాజాగా ఆ టీమ్ ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ను రెడీ చేయడం జరిగిందట. ఆ కథతో మొదట సినిమా చేయాలని భావిస్తున్నారు.
సుష్మిత ఆ కథ పట్ల చాలా ఎగ్జైట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను జీ స్టూడియోస్ వారితో కలిసి నిర్మించబోతున్నట్లుగా చెబుతున్నారు. వారు ఈ కథకు కృతి శెట్టి అయితే బాగుంటుందని భావించడం.. స్టోరీ లైన్ విన్న కృతి శెట్టి ఓకే చెప్పడం కూడా జరిగిందట.
థియేట్రికల్ రిలీజ్ కు తగ్గట్లుగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు. అన్ని విధాలుగా ఈ సినిమా కృతి శెట్టి కెరీర్ కు మరింత బూస్టింగ్ ను ఇస్తుందని మేకర్స్ అంటున్నారు. త్వరలోనే ఈ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. మెగా డాటర్ సుష్మిత నిర్మాణంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించడంతో ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.