రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న టైంలో భరత్ అనే నేను మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పొలిటికల్ జోనర్ లో వచ్చిన ఈ మూవీలో మహేష్ కెరీర్ లో తొలిసారి ముఖ్యమంత్రి రోల్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కొల్టగొట్టడమే కాదు.. అందరి ప్రశంసలూ అందుకుంటోంది.
భరత్ అనే నేను పొలిటికల్ మూవీ కాదు.. ఇదో లవ్ స్టోరీ అని తేల్చేశారు తెలంగాణా మంత్రి కేటీఆర్. డైరెక్టర్ కొరటాల శివ.. హీరో మహేష్ కేటీఆర్ తో కలిసి ఓ ప్రోగ్రాంకు అటెండయ్యారు. ముఖ్యమంత్రిగా ఈ రోల్ కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తే.. తానే హోమ్ వర్క్ చేయలేదని.. కేవలం స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేసుకుంటూ వెళ్లానని నిజాయతీగా మహేష్ సమాధానం ఇచ్చేశాడు. కొరటాల శివ మొదట తనకు స్టోరీ చెప్పినప్పుడు ఇది లవ్ స్టోరీ అనే చెప్పాడని... ఎక్కడా పొలిటికల్ అనే మాట చెప్పలేదన్నాడు. తరవాత కొంతకాలానికి ఐదుగంటల సినిమాకు సరిపడా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని వచ్చి వినిపించాడని మహేష్ చెప్పుకొచ్చాడు.
‘‘లవ్ స్టోరీ అంటే ఒక అమ్మాయికి.. అబ్బాయికి ఉండే ప్రేమే కాదు. తను చేసే పనిని.. తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రేమించే మనిషి కథ ఇది. తన మూలంగా మాట పడకూడదని ఒక అమ్మాయి కోసం సీఎం పదవిని వదిలేసిన అబ్బాయి ప్రేమ ఇందులో ఉంది. తరవాత ప్రజలు తన పట్ల చూపిన ప్రేమను అర్ధం చేసుకుని తిరిగి తన పని మొదలుపెడతాడు. కచ్చితంగా ఇది లవ్ స్టోరీయే’’అంటూ కేటీఆర్ కాంప్లిమెంట్ ఇచ్చారు.