ఒకప్పుడు సౌత్ లో వచ్చిన సినిమాలను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పెద్దగా పట్టించుకునే వారే కాదు. సౌత్ సినిమాలు అంటే పెద్దగా కంటెంట్ ఉండవని.. ఏదో కమర్షియల్ పాయింట్ తో సినిమా తీస్తారనే భావన అప్పట్లో ఉండేది. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి అంటే చాలా పెద్ద విషయంగా చర్చించుకునే వారు. కాని ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సౌత్ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. సౌత్ లో రూపొందుతున్న ప్రతి ఒక్క సినిమాపై బాలీవుడ్ మేకర్స్ ఒక కన్నేసి ఉంచుతున్నారు అనడంలో సందేహం లేదు. కొత్త సినిమాల్లో ఏదైనా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది అంటూ వెంటనే రీమేక్ కు సిద్దం అవుతున్నారు. కొత్త సినిమాలు మాత్రమే కాకుండా గతంలో వచ్చిన సినిమాలను కూడా రీమేక్ చేసేందుకు ఉత్తరాది మేకర్స్ సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకు హీరో సెంట్రిక్ సినిమాలు మాత్రమే రీమేక్ అవుతూ వచ్చాయి. అయితే భాగమతితో లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఉత్తరాదిన రీమేక్ అవ్వడం మొదలు అయ్యింది.
తెలుగులో రూపొందిన భాగమతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన ఆ రీమేక్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత మరిన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా బాలీవుడ్ ముందుకు క్యూ కట్టబోతున్నాయి. ఇప్పటికే తమిళంలో నయనతార నటించిన కొలమావు కోకిల ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా రీమేక్ అవుతున్న ఆ సినిమా తో పాటు మరో సౌత్ సినిమా కూడా హిందీలో రీమేక్ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కన్నడంలో సూపర్ హిట్ అయిన యూటర్న్ సినిమా ను ఇప్పటికే తెలుగు లో రీమేక్ చేశారు. సమంత నటించిన యూటర్న్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన యూటర్న్ సినిమా బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉంటుందనే అభిప్రాయంతో మేకర్స్ హిందీలో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యారు.
కన్నడంలో యూటర్న్ ను శ్రద్ద శ్రీనాథ్ చేయగా తెలుగులో సమంత చేసింది. రెండు చోట్ల కూడా హీరోయిన్స్ కు మంచి పేరు రావడంతో పాటు సినిమాకు మంచి స్పందన వచ్చిన కారణంగా బాలీవుడ్ లో చేయబోతున్న హీరోయిన్ ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ రీమేక్ చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్యంగా కొత్త హీరోయిన్ ను నటింపజేస్తున్నారని తెలుస్తోంది. జవానీ జానేమన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ అలయా ఎఫ్ ను యూటర్న్ రీమేక్ కు గాను సంప్రదించారు. ఆమె ఎంపిక దాదాపుగా ఖరారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. యూటర్న్ హిందీ టీమ్ విషయంలో మరింత స్పష్టత వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.