ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కావాలన్నా.. భారీ క్రేజ్ ని సొంతం చేసుకుని వసూళ్లని రాబట్టాలన్నా అన్నీ కుదరాలి అంతే కాకుండా చాలా విషయాలు పరిగణలోకి వస్తాయి. అవన్నీ కుదరని సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియకుండానే సైలెంట్ గా సైడ్ అయిపోతున్నాయి.
ఇటీవల అంటే ఫిబ్రవరి 18న విడుదలైన `వర్జిన్ స్టోరీ` ఫెయిల్యూర్ వెనక కూడా ఓ ఆసక్తికరమైన కథ వుందని నిర్మాత లగడపాటి శ్రీధర్ ఓ విచిత్రమైన లాజిక్ ని వినిపిస్తున్నారు.
`వర్జిన్ స్టోరీ` చిత్రంతో లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహదేవ్ హీరోగా పరిచయమయ్యాడు. అల్లు అర్జున్ నటింటిచిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రంలో సాయి కుమార్ తనయుడిగా కీలకమైన అన్వర్ పాత్రలో నటించిన విక్రమ్ సహదేవ్ `వర్జిన్ స్టోరీ`తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు.
అయితే ఆ ప్రయత్నం ఫెయిల్ కావడంతో దీనికి లగడపాటి శ్రీధర్ ఓ లాజిక్ స్టోరీని చెప్పారు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ వసూళ్లు ఎలా వున్నాయని అడిగితే ఆసక్తికరమైన స్టోరీ చెప్పుకొచ్చారు.
నిజాయితీగా చెప్పాలంటే ఈ మూవీ వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. ఈ విషయంలో నేను చాలా డిజప్పాయింట్ అవుతున్నాను. థియేటర్లకి ప్రేక్షకులు రావడం లేదు. ఆడియన్స్ థియేటర్లలోకి రాకపోవడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ వుంది. అదే `భీమ్లా నాయక్`. ఇటీవల మేకర్స్ `భీమ్లా నాయక్` చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకు ముందే మేము మా చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్టు వెల్లడించాం.
అయితే `భీమ్లా నాయక్` రిలీజ్ డేట్ ప్రకటించే వరకు మా సినిమా పై మంచి బజ్ వుంది. ఎప్పుడైతే `భీమ్లా నాయక్` రిలీజ్ డేట్ ప్రకటించారో ఆ క్షణమే మా మూవీ పై వున్న బజ్ మొత్తం పోయింది. ఇదే తరహాలో నేను నిర్మించిన `పోటుగాడు` చిత్రానికీ జరిగింది. ఈ మూవీ రిలీజ్ సమయంలో హఠాత్తుగా `అత్తారింటికి దారేది` చిత్రాన్ని రిలీజ్ చేశారు. ముందు అనుకున్న డేట్ లో కాకుండా ముందే థియేటర్లలోకి తీసుకొచ్చారు.
ఇలా జరగడం వల్ల `పోటుగాడు` మూవీ పై వున్న క్రేజ్ అంతా పోయింది` అని లగడపాటి శ్రీధర్ చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెబుతున్నారు. సినిమా ఫెయిల్యూర్ గురించి ప్రతీ నిర్మాత ఏదో ఒక కారణం చెబుతుంటారు. లగడపాటి శ్రీధర్ కూడా అదే తరహాలో తన సినిమాలు మరొకరి వల్ల పోయాని చెప్పడం కాస్త విడ్డూరంగానే వుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదే బలమైన కారణమని నమ్మితే ఆయన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే మంచిదని పలువురు సలహాలిస్తున్నారట.