పొరుగు భాషల్లో ఓ మంచి సినిమా వచ్చిందంటే చాలు. వెంటనే దానిపై కర్చీఫ్ లు వేసేస్తుంటారు మన నిర్మాతలు. మొదటైతే హక్కుల్ని కొనేద్దాం, ఆ తర్వాత డబ్బింగో రీమేకో ఏదో ఒకటి చేసుకొందాం అని ఫిక్సయిపోతున్నారు. అందుకే వచ్చే యేడాది తెలుగులో రీమేక్ సినిమాల హడావుడే ఎక్కువగా కనిపించేలా ఉంది. సీనియర్లు మొదలుకొని యువ కథానాయకుల వరకు అందరూ కూడా రీమేక్ సినిమాలపై మొగ్గు చూపుతుండడమే అందుకు కారణం. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు రీమేక్ రైట్స్ ని చేతిలో పెట్టుకొని కొత్త సినిమాల్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అందులో లగడపాటి శ్రీధర్ ఒకరు.
గతేడాది తమిళ్ లో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఘన విజయం సాధించిన చిత్రం గోలీసోడా. అప్పట్లో ఆ సినిమా పేరు అన్ని పరిశ్రమల్లోనూ మార్మోగిపోయింది. ఆ ఊపు చూశాక మనవాళ్లు వెంటనే తెలుగులో రీమేక్ చేసి తీసుకురావొచ్చేమో అనిపించింది. కానీ రకరకాల కారణాలవల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సినిమా రైట్స్ లగడపాటి శ్రీధర్ చేతికొచ్చాయి. ఆయన తెలుగుతోపాటు - కన్నడలోనూ సినిమాని తీయబోతున్నారు. తన కొడుకు విక్రమ్ సాయిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఆ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు లగడపాటి ప్రకటించారు. విక్రమ్ రేసుగుర్రం - రుద్రమదేవి లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకొన్నాడు. ఇప్పుడు కథానాయకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. గోలీసోడా టీనేజ్ కుర్రాళ్ల స్టోరీ. మరి తెలుగులోనూ తమిళంలోలాగే మేజిక్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.