ఆర్‌ఆర్‌ఆర్‌ : 400.. 450 కాదు అంతకు మించి అంటున్న జక్కన్న

Update: 2022-03-15 10:36 GMT
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలోనే రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా నిర్మాత దానయ్య ఒక ప్రకటన చేశాడు. ఆ సమయంలోనే బడ్జెట్‌ విషయమై సినీ జనాలు చెవులు కొరుక్కున్నారు. సినిమా కొన్ని కారణాల వల్ల దాదాపుగా రెండు సంవత్సరాల పాటు ఆలస్యమైంది.

ఆలస్యం కారణంగా భారీ ఎత్తున ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోయి ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే మరో యాభై నుండి వంద కోట్ల వరకు అంటే నాలుగు వందల కోట్ల బడ్జెట్ కాస్త 450 లేదా 500 కోట్ల వరకు వెళ్లి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా రాజమౌళి ఈ సినిమాకు అయిన బడ్జెట్‌ ను తెలియజేశాడు. ఈ సినిమా కోసం రాజమౌళి ఖర్చు చేసింది 400 కోట్లు కాదట.. ఏకంగా  550 కోట్లు ఖర్చు అయ్యిందని క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 550 కోట్లు అంటూ ఆయన చేసిన ప్రకటన ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ లో రూపొందిన కొన్ని చిన్న సినిమాల బడ్జెట్‌ కంటే కూడా అధికంగా ఈ సినిమా బడ్జెట్‌ ఉంది అంటున్నారు.  ఇప్పటి వరకు బాలీవుడ్‌ లో ఈ రేంజ్ బడ్జెట్‌ సినిమాను చేయలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

రాజమౌళి సినిమా కి రూ. 550 కోట్లు పెట్టినా కూడా వస్తాయనే నమ్మకం నిర్మాతకు ఉంటుంది. అందుకే దర్శకుడి కోరిక మేరకు రూ. 550 కోట్ల ను నిర్మాత పెట్టి ఉంటాడు అంటూ సినీ విశ్లేషకులు మరియు వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి 500 కోట్లు పెట్టి తీసిన 600 కోట్లు పెట్టి తీసినా కూడా ఖచ్చితంగా రికవరీ అనేది ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే దాదాపు ఎనిమిది వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ అధికారికంగా క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాను మార్చి  25 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా విడుదల ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

హీరోలు ఇద్దరు మరియు దర్శకుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో అగ్రెసివ్‌ గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యం లో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేస్తుందని కొందరు.. బాహుబలిని బీట్ చేస్తుందా అనేది కొందరు చెబుతున్న మాట. మరి అసలు విషయం ఏంటీ అనేది చూడాలి.
Tags:    

Similar News