లైగ‌ర్ కి ప్యాక‌ప్ చెప్పాకే నిదుర‌పోతాన‌న్న రౌడీ

Update: 2021-03-09 08:30 GMT
క‌రోనా క్రైసిస్ లాక్ డౌన్ తో టాలీవుడ్ అల్ల‌క‌ల్లోలంగా మారిన సంగ‌తి తెలిసిందే. అన్ని షూటింగులకు బిగ్ బ్రేక్ ప‌డింది. ఆ క్ర‌మంలోనే రౌడీ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా పూరి తెర‌కెక్కిస్తున్న లైగ‌ర్ కి బిగ్ బ్రేక్ ప‌డింది. పాన్ ఇండియా హోప్స్ తో ఎంతో ఘ‌నంగా ప్రారంభించిన ఈ మూవీకి స‌డెన్ బ్రేక్ ప‌డ‌డం నిజంగానే చిత్ర‌బృందాన్ని క‌ల‌వ‌రపెట్టింది. ఏడెనిమిది నెల‌ల పాటు ఎలాంటి షూటింగు లేకుండా టీమ్ గ‌డిపేసింది.

ఇటీవ‌లే ముంబైలో షెడ్యూల్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఓవైపు ముంబై-గోవాలో షెడ్యూల్ ముగించి దేవ‌ర‌కొండ ఇటు హైద‌రాబాద్ లో త‌న స్నేహితుల  సినిమాల‌కు ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌స్తుతం జాతిర‌త్నాలుకి దేవ‌ర‌కొండ ప్ర‌మోష‌న్ చేయ‌డంతో అది రౌడీ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది.  

ఇటీవల ఓ బాలీవుడ్ మ్యాగ‌జైన్ తో దేవ‌ర‌కొండ పోస్ట్ క్రైసిస్ అంశాల‌ను ముచ్చ‌టించారు. ఈ ఇంట‌ర్వ్యూలో లాక్ డౌన్ అనంత‌రం పనిని తిరిగి ప్రారంభించ‌డంపై  తన భావనను దేవ‌ర‌కొండ‌ వెల్లడించాడు. 10 నెలల విరామం తర్వాత తిరిగి జాబ్ లోకి రావ‌డంపై మాట్లాడుతూ..మహమ్మారికి ముందు తాను అవిశ్రామంగా చాలా గంటలు పని చేసానని.. ఇంటికి వెళ్లి నిద్రపోయేలా ప్యాక్-అప్ కోసం ఎదురు చూసాన‌ని  దేవ‌ర‌కొండ చెప్పారు.

కానీ అతను గత నెలలో తిరిగి పనిని తిరిగి ప్రారంభించినప్పుడు పూర్తిగా సెట్లోనే ఉండాలని మాత్రమే కోరుకున్నాడ‌ట‌. ``మొదటి రోజు నుంచి.. షూట్ కొనసాగాలని నేను కోరుకున్నాను`` అన్నారు. ముంబై షెడ్యూల్ తర్వాత గోవాలో ఒక పాట కూడా చిత్రీకరించారని దేవ‌ర‌కొండ తెలిపారు. తదుపరి షెడ్యూల్ కోసం గుర్గావ్ ‌లోని ఫిల్మ్ సిటీలో ఒక సెట్ ‌ను రెడీ చేస్తున్నందున లైగర్ బృందం ప్రస్తుతం స్వల్ప విరామంలో ఉంది.  విదేశాలలో కూడా ఒక‌ షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉంటుందని దేవ‌ర‌కొండ‌ వెల్లడించారు. మొదట్లో యూరప్ అనుకున్నాం.. కానీ ఇప్పుడు అబుదాబి కూడా ఒక ఎంపిక .. అని తెలిపారు.

ప్రారంభంలో లాక్ డౌన్ మూడు నెలల్లో ముగుస్తుందని భావించాం. ఆ త‌ర్వాత 6 నెల‌లు అనుకున్నాం. కానీ కుద‌ర‌లేదు. కానీ ఆ అనిశ్చితి తనకు షూట్ కోసం పూర్తిగా రెడీ అయ్యేందుకు సహాయపడిందని దేవ‌ర‌కొండ తెలిపారు. ఈ టైమ్ లోనే హిందీ భాష‌ బెట‌ర్ మెంట్ కోసం చాలా నేర్చుకున్నాన‌ని తెలిఆరు. తాను హైదరాబాద్ ‌లో పెరిగానని అక్కడ అందరూ హిందీని త‌క్కువ‌గా మ‌ట్లాడేవార‌ని కూడా తెలిపారు. హిందీ డైలాగు‌లు మాట్లాడటం చాలా కష్టమేమీ కాదు. కానీ లైగర్ ‌లోని తన పాత్రకు త‌గ్గ‌ట్టు భాషా విధానం ఉండాల‌నే జాగ్ర‌త్త ప‌డ్డాన‌ని తెలిపారు
Tags:    

Similar News