9 మే1989 .. ఇదీ విజయ్ దేవరకొండ బర్త్ డే. 30 బార్డర్ క్రాస్ చేశాడు. 2020లో బర్త్ డే లేదు. కోవిడ్ విలయం వల్ల సైలెంట్ గా కానిచ్చేశాడు. అంతకుముందులా ప్రచార హంగామా కుదరలేదు. ఇప్పుడు మరో రెండ్రోజుల్లోనే వీడీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇలాంటప్పుడు హంగామా చేయడానికి ఏమీ ఉండదు. అందుకే సోషల్ మీడియా వేదికగా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఫ్యాన్స్ సంగతేమో కానీ లైగర్ టీమ్ ఏం చేయబోతోంది? అభిమానులకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వబోతోందా? లైగర్ టీజర్ ని రెడీ చేస్తోందా? అంటే సరైన క్లారిటీ లేదు. ఇవ్వాలా వద్దా? అన్న సందిగ్ధత పూరి-ఛార్మి టీమ్ లో అలానే ఉందిట. కోవిడ్ అందరినీ ఇరకాటంలో పెట్టింది. షూటింగ్ సజావుగా సాగకుండా అడ్డుకుంది. ఈ కష్టకాలం ఊహించనిది. అందుకే లైగర్ టీమ్ నిరాశగా ఉంది. అయితే పుట్టినరోజున నిరాశపరచకుండా వీడీ అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తారు? అన్నదే ఇప్పటికి సస్పెన్స్.
అయితే టీజర్ వస్తేనే బావుంటుందనేది మెజారిటీ అభిమానుల విశ్లేషణ. లైగర్ లాంటి పాన్ ఇండియా సినిమాని ఎప్పుడూ లైవ్ లో ఉంచితేనే జనం కనెక్టయి ఉంటారు. అలా కాకుండా దాచేసే కొద్దీ అది ఉందా లేదా? అనే సందిగ్ధతకు లోనవుతారు. అందుకు అవకాశం ఇవ్వకుండా ఏదో ఒక సెన్సేషన్ కి తావిస్తూనే ఉండాలి. కనీసం పూరి ఈసారి ఆర్జీవీ తరహాలో ఏదైనా టెక్నిక్ ని ప్లే చేస్తారేమో చూడాలి. కరణ్ జోహార్ అంతటి పెద్ద నిర్మాత అండతో తెరకెక్కుతున్న ఈ మూవీకి అటు హిందీ బెల్ట్ లోనూ కనెక్టయ్యే మాంచి విజువల్ తో రావాల్సి ఉంటుంది.
లైగర్ సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. అప్పటికి సన్నివేశం ఎలా ఉండనుంది? అన్నది వేచి చూడాలి. అనన్య పాండే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా ఇందులో కనిపిస్తారు.