బాలయ్యబాబు కథానాయకుడిగా నటించిన లెజెండ్ అతడి కెరీర్‌లోనే ది బెస్ట్ వసూళ్లతో రికార్డు సాధించింది. 45 కోట్లు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి టాప్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత అంతే హైప్‌తో తెరకెక్కిన సినిమా లయన్. బాలయ్య సీబీఐ అధికారిగా పవర్‌ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమా రికార్డులన్నిటినీ తిరగరాస్తుందనే భావించారంతా. కానీ డెబ్యూ డైరెక్టర్ సత్యదేవ తుస్సుమనిపించాడు.
గ్రిప్పింగ్ లేని నేరేషన్ ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. ఫలితం కనీస వసూళ్లయినా లేకుండా చాపచుట్టుకుపోయింది. ఏపీలో 7.6కోట్లు, సీడెడ్ 3.3కోట్లు, నైజాం 4.2కోట్లు షేర్ వసూలు చేసింది. ఏపీ, తెలంగాణకు ఓవర్‌సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుంటే లయన్ సాధించిన మొత్తం షేర్ 16.8 కోట్లు. ఇకపోతే ఇండియాలోనే థియేట్రికల్ విలువ రూపంలో 24 కోట్లు. ఆ లెక్కన చూస్తే వసూళ్ల పరంగా సూపర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఆ మేరకు బయ్యర్లకు భారీ నష్టాల్నే మిగిల్చిందీ చిత్రం. సినిమా గురించి ఎంత ప్రచారం చేసినా, ఎంత బాగుందని అరిచినా కూడా లాసే వచ్చింది మరి.