ఫైర్ బ్రాండ్ బ్యూటీ ఆస్తి లెక్క తెలిస్తే అవాక్కే

Update: 2020-03-25 09:15 GMT
ఇటీవల కాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ అదే పనిగా కనిపించే శ్రీరెడ్డినే తీసుకుందాం. ఆమె వాడే కారు.. ఆమె ఉండే ఇల్లు లాంటివి చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. అలాంటిది కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించటమే కాదు.. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కోచ్ గురించి మొట్టమొదటగా ఓపెన్ గా మాట్లాడిన దమ్మున్న ఫైర్ బ్రాండ్ బ్యూటీ ఎవరంటే.. ఆరణాల అచ్చతెలుగు అందం మాధవిలతగా చెప్పాలి.

అందానికి అందం.. అంతకు మించిన మాటకారి తనం.. సూటిగాసుత్తి లేకుండా విషయాల్ని తేల్చేయటమే కాదు.. ప్రశ్న ఏదైనా దాపరికం లేకుండా చెప్పేయటం ఆమె సొంతం. ఆ మాటకు వస్తే.. యూట్యూబుల్లో ఇంటర్వ్యూలు మస్తు ఫేమస్ కావటానికి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఒక కారణంగా చెబుతారు. అప్పటివరకూ హీరోయిన్లు ఎవరూ చెప్పని విధంగా.. నిర్మోహమాటంగా విషయాల్ని తేల్చేసే ఆమెకున్న ఇమేజ్ రోటీన్ కు భిన్నమని చెప్పాలి.

అలాంటి ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్బంగా ఆమె ఆస్తిపాస్తుల లెక్క మీద ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె నుంచి ఎలాంటి సమాధానం వస్తుందన్న ఆసక్తి వ్యక్తమైంది. అలాంటివేళ.. మాధవిలత నోటి నుంచి వచ్చిన మాటలు విని అవాక్కు అయ్యే పరిస్థితి. ఈ టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు సొంతిల్లు అంటూ లేదని వెల్లడించింది. కమిట్ మెంట్లకు వ్యతిరేకం కావటమే కాదు.. తేడా వస్తే చెంప ఛెళ్లుమనిపించేలా సమాధానాలు చెప్పే ఆమె తీరు.. చాలా సినిమా అవకాశాల్ని పోగొట్టింది.

పలువురు దర్శకుల వేధింపులకు తాను గురైనట్లు చెప్పేసి సంచలనంగా మారిన మాధవిలత.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సినిమాల్లో నటించటం కంటే కూడా తాను.. షోరూంలు..షాపులు ఓపెనింగ్ ద్వారానే ఎక్కువ సంపాదించినట్లుచెప్పింది. మొత్తానికి సినిమారంగంలో తారగా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నా.. సంపాదన.. ఆస్తిపాస్తుల్ని కూడబెట్టటంలో మాత్రం వెనుకబడిన వైనాన్ని ఇంత ఓపెన్ గా మాధవిలత మాత్రమే చెప్పగలరేమో?
Tags:    

Similar News