టైటిల్ కుదరక మహేశ్ మూవీ ఫస్ట్ లుక్ వాయిదా

Update: 2017-03-10 08:05 GMT
మహేష్ బాబు హీరోగా మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌ లో న‌టిస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా మొదలై దాదాపు ఏడాది దగ్గర పడుతున్నా కూడా ఈ సినిమాకు సంబందించిన టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ బయటికి రాలేదు. ముఖ్యంగా ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారో అన్న ఆసక్తి మహేష్ ఫాన్స్ లో ఎక్కువైంది. ఇప్పటికే రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. మొత్తంగా ప్రేక్షకులకు షాక్ ఇచ్చే న్యూస్ .. ? ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు విడుదల చేస్తారనుకున్నా అది వాయిదా పడింది.  ఉగాది కానుకగా టీజర్ ని విడుదల చేసి..  జూన్ 23 న సినిమా విడుదల చేయాలన్నది ప్లాన్. కానీ.. పోస్టర్ రిలీజే వాయిదా వేయడంతో మిగతా కార్యక్రమాల సంగతేంటనేది తేలలేదు.
    
ప్రస్తుతం షూటింగ్‌ బిజీలో అందరూ నిమగ్నమై వుండడంతో టైటిల్‌ అనౌన్స్‌ మెంట్‌ - ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ వాయిదా వేసారట. ఒక రెండు - మూడు వారాల తర్వాత వీలు చూసుకుని విడుదల చేస్తారట. గంటలు - నిమిషాలు లెక్కపెడుతూ కూర్చున్న అభిమానులు ఈ లేటెస్ట్‌ అప్‌ డేట్‌ తో పూర్తిగా నీరుగారిపోయారు.  అయితే.. సినిమా టైటిల్ ఖరారు కాకపోవడంతోనే పోస్టర్ రిలీజ్ ఆగినట్లు టాక్.  
    
కాగా అభిమన్యు అని, స్పైడర్‌ అని ఈ చిత్రానికి కొత్త టైటిల్స్‌ ప్రచారంలోకి వచ్చాయి. వీటన్నిటికీ ఇవాల్టితో ఫుల్‌ స్టాప్‌ పడిపోతుందని అనుకుంటే, మళ్లీ కథ మొదటికి వచ్చింది. వాళ్లు పేరేంటో అనౌన్స్‌ చేసేలోపు ఇంకెన్ని టైటిల్స్‌ ప్రచారంలోకి వస్తాయో. అయితే డిస్కషన్‌ లోకి వచ్చిన ప్రతి టైటిల్‌ని లీక్‌ చేసి - ఫీడ్‌ బ్యాక్‌ ఎలాగుందో తెలుసుకుంటున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇంతవరకు చాలా టైటిల్స్‌ ప్రచారమైనా ఎక్కువ మంది 'సంభవామి'కే ఓటేసారు. కానీ మహేష్‌ మాత్రం ఆ పేరు వద్దని స్పష్టంగా చెప్పేశాడట. దీంతో టైటిల్ పై అనిశ్చితి ఇంకా తొలగలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News