మహేష్ టైటిల్ అది మాత్రం కాదా??
మహేష్ బాబు బాబు నటిస్తున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ చేస్తూన్నా ఇంకా షూట్ జరగాల్సిన పార్ట్ ఎక్కువగానే ఉన్న సంగతి తెలిసిందే. కంటిన్యూస్ గా చిత్రీకరణ చేసేసి.. జూన్ చివరి వారానికల్లా రిలీజ్ చేసేయాలన్నది దర్శకుడు మురుగదాస్ ఆలోచన.
మూవీ రిలీజ్ సంగతేమో కానీ.. అసలు ఇప్పటివరకూ ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ కూడా ఇవ్వలేదు. ఇందుకు కారణం.. సినిమాకు టైటిల్ డిసైడ్ చేయలేకపోవడమే. టైటిల్ లేకుండా పోస్టర్ వేయడానికి వీల్లేదని కండినషన్ పెట్టాడట సూపర్ స్టార్. ఇప్పటివరకూ చాలా పేర్లు వినిపించగా.. ఇప్పుడు మహేష్ మూవీకి టైటిల్ ఫైనల్ చేసేశారని తెలుస్తోంది. మహేష్-మురుగదాస్ ల మూవీ టైటిల్.. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే.. గతంలో వినిపించినట్లుగా ఇది 'సంభవామి' మాత్రం కాదంటున్నారు సన్నిహితులు. ఏజంట్ శివ.. వాస్కొడ గామా.. చట్టానికి కళ్లు లేవు.. మర్మం.. అభిమన్యు లాంటి టైటిల్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి.. ఇప్పుడో కొత్త క్యాచీ టైటిల్ తో ముందుకు రానున్నారట.
ఇంతకీ దీని రిలీజ్ ఎప్పుడో తెలుసా.. మార్చ్ 10వ తేదీనే. అవును.. మరో రెండు రోజుల్లోనే మహేష్ మూవీకి టైటిల్ ను ప్రకటించబోతున్నారు. అది కూడా ఫస్ట్ లుక్ తో పాటే రిలీజ్ చేసేయనున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రం జూన్ 23న రిలీజ్ కి ప్లాన్ చేయగా.. మూడు నెలల ముందే అభిమానులు పండుగ చేసుకునే సందర్భం వచ్చేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/