సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు.. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు ఇటీవల మరణించారనే విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రమేష్.. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో జనవరి 8న కన్నుమూశారు. అన్నయ్య మరణం మహేష్ కు తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే మహేష్ కరోనా బారిన పడటంతో అన్నను కడసారి చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు మహేష్ బాబు కోవిడ్ నుంచి కొలుకొని క్వారంటైన్ లో ఉన్నారు. ఈరోజు శనివారం రమేష్ బాబు దశదిన పెద్ద కర్మ కార్యక్రమం ఉండటంతో మహేష్ తన సోదరుడి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. వదిన మృదుల మరియు పిల్లలను పరామర్శించిన మహేష్.. అన్నను తలచుకొని భావోద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది. కృష్ణ - సుధీర్ బాబు తో పాటుగా మిగతా ఘట్టమనేని కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోదరుడు రమేష్ బాబుతో మహేష్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. రమేష్ అంటే మహేష్ కు ఎంతో గౌరవం అభిమానం ఉండేవని వాళ్ళని దగ్గరగా చూసిన ప్రముఖులు చెబుతూ ఉంటారు. కృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో రమేష్ తండ్రి బాధ్యతను తీసుకొని కుటుంబ పెద్దగా వ్యవహరించేవారు.
బయటికి అంతగా కనిపించక పోయినప్పటికీ చిన్నతనం నుంచే రమేష్ - మహేష్ లు ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారట. రమేష్ బాబు నిర్మాతగా మారిన సమయంలో తమ్ముడు ఎంతో అండగా నిలిచారని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. మహేష్ తో 'అర్జున్' 'అతిథి' వంటి సినిమాలు నిర్మించిన రమేష్.. 'దూకుడు' 'ఆగడు' చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.
అన్న మరణంతో మహేష్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని తెలుస్తోంది. ''నువ్వే నా స్పూర్తి ప్రధాతవి.. నువ్వే నా బలం, నువ్వే నా ధైర్యం, నువ్వే నాకు లోకం, సర్వస్వం.. నాలో సగభాగానివి నువ్వే.. నువ్ లేకుండా ఈ రోజు ఇలా నేను ఉండేవాడిని కాదు.. నాకోసం ఎంతో చేశారు. వాటికి థ్యాంక్స్. ఇప్పుడు మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి.. నాకంటూ ఇంకో జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా మీరు నాకు అన్నయ్యగానే ఉండాలి.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను'' అంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు.
రమేష్ బాబుకు భారతి - జయకృష్ణ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారి బాధ్యతను మహేష్ బాబు - నమ్రతలు తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.