మహేష్ కి ఆ టైటిల్.. అంత తేలిక కాదులే
మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీకి టైటిల్ విషయంలో బోలెడంత కన్ఫ్యూజన్ నెలకొంది. రకరకాల పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇప్పటికీ మూవీ పేరు విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే సంభవామి.. ఏజెంట్ శివ.. మర్మం లాంటి అనేక పేర్లు ప్రచారం అవగా.. ఇప్పుడు కొత్త పేరు వినిపిస్తోంది.
మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న ఈ కొత్త సినిమాకు.. 'స్పైడర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. స్టోరీకి తగినట్లుగా ఈ పేరు ఉంటుందని.. ఇదే టైటిల్ ఫైనల్ అయిపోయిందనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. నిజానికి ఈ పేరు పెట్టడం అంత ఈజీ ఏమీ కాదు. హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ ను తలపించేలా పేరు పెట్టడం అంటే.. కోరి వివాదాలతో తల గోక్కోవడమే అని చెప్పాలి. స్పైడర్ మ్యాన్ టైటిల్ పై.. మార్వెల్ ఎంటర్ ప్రైజెస్.. కొలంబియా పిక్చర్స్ కు సర్వహక్కులు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రైట్స్ అన్నీ వాళ్ల సొంతమే అయి ఉంటాయి. ఇప్పటికే యాక్షన్ జాక్సన్ మూవీ టైటిల్ విషయంలో నానా ఇబ్బందులు పెట్టాయి హాలీవుడ్ స్టూడియోస్. చివరకు భారీగా రాయల్టీ తీసుకుని సైలెంట్ అయ్యారని టాక్.
ఇప్పుడు మహేష్ కోసం స్పైడర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసేయడం సాధ్యమయ్యే పని కాదు. పైగా మహేష్ బాబు అంటే దాదాపు 30 బ్రాండ్స్ అసోసియేట్ అయి ఉంటాయి కాబట్టి.. హాలీవుడ్ స్టూడియోస్ వారు కూడా టైటిల్ ను అంత తేలికగా ఇచ్చేయరు. ఈ మాత్రం లాజిక్ ని దర్శకుడు మురుగదాస్ కానీ.. హీరో మహేష్ బాబు కానీ గుర్తించలేరని అనుకోవడం పొరపాటే. చూద్దాం మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/