మహేష్‌ కు రోడ్ క్లియరైందిగా...

Update: 2017-03-03 16:51 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ అరంగేట్రానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందనున్న మూవీతో తమిళ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు మహేష్. జూన్ 23ను రిలీజ్ డేట్ గా అనౌన్స్ చేశారు కూడా. అయితే.. తల అజిత్ రూపంలో సూపర్ స్టార్ కి తలనొప్పి ఎదురైంది.

అజిత్ నటిస్తున్న వివేగం మూవీని కూడా అదే రోజుకు షెడ్యూల్ చేశారు. తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉండే అజిత్ ముందు.. మహేష్ సినిమా నిలబడ్డం కష్టమని తేల్చేశారు చాలామంది. అయితే.. తమ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా చెప్పేశారు వివేగం మేకర్స్. దీంతో మహేష్ కి దారి ఇస్తూనే అజిత్ ఈ డెసిషన్ తీసుకున్నాడనే టాక్ మొదలైంది. వాటి సంగతి పక్కన పెడితే.. తమ హీరోకి తమిళనాట గ్రాండ్ వెల్కం లభించబోతున్నందుకు ఫ్యాన్స్ తెగ ఖుషీగా ఉన్నారు.

ప్రస్తుతం హైద్రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. భారీ సెట్ లో ఓ స్పెషల్ సాంగ్ పిక్చరైజేషన్ చేస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. ఈ మూవీ టైటిల్ పై చాలా రకాల రూమర్స్ ఉన్నాయ్ కానీ.. ఇప్పటివరకూ మహేష్ నుంచి కన్ఫర్మేషన్ లేకపోవడంతో.. ఈ టైటిల్ ఇంకా ఫైనల్ చేయలేదనే విషయం అర్ధమయిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News