కొత్త పుకారు.. జక్కన్న మరీ అంత తక్కువ గ్యాప్‌ లో షురూ చేస్తాడా?

Update: 2021-06-20 11:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమా బాహుబలి తర్వాత ఉండాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల బాహుబలి తర్వాత మహేష్‌ తో కాకుండా చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లతో మల్టీ స్టారర్‌ సినిమాను జక్కన్న చేస్తున్న విషయం తెల్సిందే. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత ఖచ్చితంగా మహేష్‌ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. మహేష్‌ బాబు కూడా జక్కన్న ఎప్పుడు అడితే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు రెడీ అన్నట్లుగానే ఉన్నాడు.

ఇప్పటి వరకు మహేష్ బాబు.. రాజమౌళిల సినిమా గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత తాను మహేష్‌ తో సినిమా చేస్తాను అంటూ జక్కన్న ప్రకటించడం తప్ప ఇప్పటి వరకు కొత్త అప్ డేట్‌ లేదు. అయినా కూడా నెట్టింట రోజుకో పుకారు షికారు చేస్తోంది. సినిమా కు ఉన్న బజ్‌ నేపథ్యంలో చిన్న పుకారు కూడా నెట్టింట ట్రెండ్డింగ్‌ అవుతుంది. తాజాగా మరో కొత్త పుకారు నెట్టింట షికారు చేస్తుంది. ఆ వార్త ఖచ్చితంగా నిజం కాకపోవచ్చు అని అంతా అనుకుంటూ నిజం అయితే బాగుండని మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

ఇంతకు ఆ పుకారు ఏంటీ అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్‌ బాబు.. జక్కన్న ల సినిమా ప్రారంభం కాబోతుంది. రెగ్యులర్‌ షూటింగ్ కూడా ఆ వెంటనే మొదలు పెట్టబోతున్నారు. ఈ వార్త ఖచ్చితంగా నిజం కాదు. ఎందుకంటే జక్కన్న తన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలో రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు ముందు స్క్రిప్ట్‌ రెడీ చేయడం.. మహేష్‌ బాబుతో సినిమా మొదలు పెట్టడం దాదాపు అసాధ్యం. వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు జక్కన్న మహేష్‌ బాబుల సినిమాను ఊహించలేం. ఆర్‌ ఆర్‌ ఆర్‌ పూర్తి అయిన అంత తక్కువ గ్యాప్‌ లో జక్కన్న కొత్త సినిమా మొదలు పెట్టడం సాధ్యం అయ్యే విషయమే కాదని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా పట్టాలెక్కితే బాగుండని కోరుకుంటున్నారు.
Tags:    

Similar News