ఎదురు చూపులకు తెర దించి మహేష్ బాబు 27వ చిత్రంను కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ప్రకటించిన విషయం తెల్సిందే. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోతున్న చిత్రం సర్కారు వారి పాట అంటూ క్లారిటీ ఇచ్చేశారు. టైటిల్ రివీల్ చేయడంతో పాటు మహేష్ బాబు ప్రీ లుక్ ను కూడా విడుదల చేశారు. టైటిల్ మరియు మహేష్ లుక్ వచ్చిన తర్వాత సినిమా కథ గురించి సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.
తాజాగా సినీ వర్గాల్లో ఈ చిత్రం కథ గురించి ఆసక్తికర విషయాలు ప్రచారం జరుగుతున్నాయి. కథలోకి వెళ్తే.. మహేష్ బాబు గోవాలో ఉంటూ డబ్బు అత్యవసరం ఉన్న వారికి అధిక వడ్డీకి ఇస్తూ ఉంటాడు. డబ్బులు వసూళ్లు చేసుకోవడంతో పాటు డబ్బులు ఇచ్చే సన్నివేశాలు చాలా ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటాయనేది టాక్. ఇది ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ కోసం మహేష్ బాబు పాత్రకు డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే. కథ మెయిన్ స్ట్రీమ్ ఏంటంటే బ్యాంకులను వందల కోట్లు ముంచి విదేశాలకు పారిపోయిన బడా వ్యాపారస్తుల నుండి డబ్బు రాబట్టడం అంటున్నారు.
సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత మహేష్ బాబు చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడం భాషల్లో కూడా విడుదల అయ్యే అవకాశం ఉందట. ఇక ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేశారట. త్వరలోనే ఆ విషయమై అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం షూటింగ్స్ జరిగే పరిస్థితి లేదు కనుక మరో రెండు మూడు నెలలు ఆగి సినిమా రెగ్యులర్ ప్రారంభించే అవకాశం ఉందట.