అప్పటికే హిట్ కొట్టి నిరూపించుకున్న సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే విజయావకాశాలు ఎక్కువే. అందునా తమిళంలో హిట్ కొట్టిన చాలా సినిమాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్స్. పొరుగు సినిమాల్ని రీమేక్ చేసేందుకు మన దర్శకనిర్మాతలు ఎల్లపుడూ ముందుంటున్నారు. ఇప్పుడు అదే బాటలో తమిళంలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తని ఒరువన్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు మన మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం. అంతేకాదండోయ్ ఈ సినిమా రీమేక్ లో నటించేందుకు ఇద్దరు స్టార్ హీరోల మధ్య తీవ్ర పోటీ నెలకొందని చెబుతున్నారు. డీప్ గా డీటెయిల్స్ లోకి వెళితే...
జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన తని ఒరువన్ తమిళ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో జయం రవి నటనకు విమర్శకుల ప్రశంసలొచ్చాయి. ఐపీఎస్ ఆఫీసర్ గా జయం రవి నటన తంబీల్ని విపరీతంగా ఆకట్టకుంది. ఈ సినిమా ప్రివ్యూని ఇప్పటికే మహేష్ చూశారు. ఫైనల్ చేయడానికి వేచి చూస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈలోగానే దర్శకుడు మోహన్ రాజా హైదరాబాద్ లో అడుగుపెట్టి మహేష్, చరణ్ లతో మంతనాలు జరపడానికి రెడీ అవుతున్నారట.
కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ లో అడుగుపెట్టి.. ఈ ఇద్దరిలో ఎవరు ఓకే చెప్పినా వెంటనే సెట్స్ కెళ్లాలన్నది రాజా ఆలోచన. తెలుగులోనూ స్వయంగా రాజా దర్శకత్వం వహించాలన్నది ప్లాన్. అయితే ఇప్పటికే చరణ్, మహేష్ వైపు నుంచి కూడా తని ఒరువన్ రీమేక్ పై పోటీ వాతావరణం నెలకొందని చెప్పుకుంటున్నారు. మరి రేసులో గెలుపెవరిది? ఈ అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారు. వెయిట్ అండ్ సీ..