సర్కారు వారి అప్డేట్ కోసం మైత్రీ ని ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..

Update: 2021-11-02 14:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ సినిమాకు సంబంధించిన ఏ కంటెంట్ అయినా బయటకు వస్తే సోషల్ మీడియాలో వారు చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అదే సమయంలో వారు వ్యక్తం చేసే అసహనం కూడా మరో స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. తాజాగా మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఓ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కారణం తమ అభిమాన హీరో సినిమా నుంచి అప్డేట్ రాకపోవడమే.

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ''సర్కారు వారి పాట'' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 14 రీల్స్ - జీఎంబీ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నాయి. ఇటీవలే చిత్ర బృందం స్పెయిన్ లో ఓ షెడ్యూల్ షూట్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

'సర్కారు వారి పాట' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. మహేష్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన బ్లాస్టర్ తర్వాత మేకర్స్ మరో న్యూ అప్డేట్ ఇవ్వలేదు. దీపావళి పండుగ వస్తుండటంతో ఫస్ట్ సింగిల్ వస్తుందని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ మధ్య సాంగ్స్ కు సంబంధించిన విశేషాలు వెల్లడిస్తుండటంతో అందరూ మరో రెండు రోజుల్లో మొదటి పాట రావడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. అయితే మహేష్ సినిమా నుంచి దివాళికి ఎలాంటి అప్డేట్ రావడం లేదని ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో సూపర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న మిగతా సినిమాలకు సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తుండటం.. 'సర్కారు వారి పాట' నుంచి ఎలాంటి కంటెంట్ రావడం లేదని అంటుండటం మహేష్ అభిమానుల కోపానికి కారణమైంది.. ఇదే మైత్రీ టీమ్ మీద ట్రోల్స్ వచ్చేలా చేసింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈరోజు ట్విట్టర్ లో మైత్రీ ప్రొడక్షన్ హౌస్ మీద ఓ నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు. సర్కార్ వారి అప్డేట్ వచ్చే వరకు వెనక్కి తగ్గేదే లే అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన కంటెంట్ లీక్ అవుతున్నా అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ 130K కు పైగా పోస్టులతో ట్రెండ్ అవుతోంది.

అయితే మహేష్ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వినతులు - ట్రోల్స్ వస్తుండటంతో 'సర్కారు వారి పాట' మేకర్స్ ఓ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
Tags:    

Similar News