అక్కినేని నాగచైతన్య - సమంత జంట పెళ్లి తర్వాత నటించిన సినిమాగా `మజిలీ` సెంటిమెంటును క్యారీ చేసిన సంగతి తెలిసిందే. ఆన్ సెట్స్ ఉండగానే అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ సాగింది. `ఏ మాయ చేశావే` తర్వాత ఆ ఇద్దరూ జంటగా నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. ఆ క్రమంలోనే పెళ్లి తర్వాత అయినా హిట్ కొడతారా? అంటూ ఆసక్తిగా మాట్లాడుకున్నారు. అందుకే చై - సామ్ జంట మజిలీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటించారు. దర్శకుడు శివ నిర్వాణను నమ్మి ముందుకు వెళ్లినందుకు ఈ జంటకు అద్భుతమైన విజయం దక్కింది. మజిలీ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు దక్కుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
`మజిలీ` సక్సెస్ కోసం అక్కినేని ఫ్యామిలీ సహా సమంత - చైతన్య ఎంత ఎగ్జయిటింగ్ గా వేచి చూశారో ఈ ఆదివారం సక్సెస్ మీట్ రివీల్ చేసింది. విజయోత్సవ వేడుకలో సమంత - చైతూ ఎంతో ఎమోషన్ అవ్వడం కనిపించింది. ఈ ఆనంద క్షణం కోసమే వేచి చూసిన కింగ్ నాగార్జున సైతం చై - సామ్ జంటను బ్లాక్ బస్టర్ జోడీ అంటూ ఆనందంగా హగ్ చేసుకుని ఆ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో రివీల్ చేశారు.
తాజాగా తొలి వీకెండ్ షేర్ వివరాలు వెల్లడించారు. మజిలీ కేవలం మూడు రోజుల్లో 17 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం చైతన్య కెరీర్ బెస్ట్ అన్న రిపోర్ట్ అందింది. వసూళ్ల లెక్కలు పరిశీలిస్తే.. నైజాం 5.26కోట్లు - సీడెడ్ 1.96కోట్లు - యుఏ 1.93కోట్లు - తూ.గో జిల్లా 0.86కోట్లు - గుంటూరు 0.65కోట్లు - కృష్ణ 1కోటి - నెల్లూరు 0.37కోట్లు .. ఓవరాల్ గా ఏపీ- నైజాం కలుపుకుని 13.27 కోట్ల షేర్ వసూలైందని ట్రేడ్ లెక్క తేల్చింది. రెస్టాఫ్ ఇండియా 1.27కోట్లు - అమెరికాతో పాటు ఓవర్సీస్ నుంచి 2.35కోట్లు వసూలైంది. ప్రపంచవ్యాప్తంగా 17.37 కోట్ల షేర్ ని మజిలీ వసూలు చేసింది. సక్సెస్ కిక్కులో ప్రస్తుతం చైతూ `వెంకీ మామ` చిత్రంలో నటిస్తున్నాడు. తదుపరి వరుసగా భారీ లైనప్ తో చై దూసుకెళ్లబోతున్నాడు. సమంత లైనప్ అంతే పెద్ద రేంజులో ఉందని తెలుస్తోంది.