మజిలీ.. అమెరికాలో పరిస్థితి ఇలా ఉంది!

Update: 2019-04-14 09:19 GMT
నాగచైతన్య - సమంతా కలిసి నటించిన 'మజిలీ' బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బయ్యర్లను లాభాల్లోకి తీసుకొచ్చిన 'మజిలీ' రెండో వారంలో కూడా డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తూ ఉంది. ఇప్పటికే 'మజిలీ' కలెక్షన్స్ నాగచైతన్య కెరీర్ బెస్ట్ గా నిలిచాయి.  గతంలో చైతు కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా 'రారండోయ్ వేడుక చూద్దాం' ఉండేది. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్ ను 'మజిలీ' దాటేసి మొదటి స్థానంలో నిలిచింది.

తెలుగు రాష్ట్రాలలో 'మజిలీ' కలెక్షన్స్ జోరుగా ఉన్నప్పటికీ అమెరికాలో మాత్రం పరిస్థితి అంత గొప్పగా లేదు. మొదటి వారాంతంలో మంచి కలెక్షన్స్ నమోదు చేసిన 'మజిలీ' తర్వాత స్లో అయింది. మొదటి వారం.. రెండో వారంలో కూడా అలాగే డల్ గా సాగుతోంది. అమెరికాలో ఇప్పటివరకూ 'మజిలీ' గ్రాస్ కలెక్షన్స్ $718K సాధించాయి. సెకండ్ వీకెండ్ పూర్తయ్యేసరికి $800K మార్క్ టచ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.  కానీ వన్ మిలియన్ డాలర్ మార్క్ దాటడం మాత్రం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

వన్ మిలియన్ డాలర్ మార్క్ ఆదుకోలేకపోయినా 'మజిలీ' ఓవర్సీస్ ఆడియన్స్ లో చైతుకు మంచి పేరు తీసుకొచ్చిందనేది మాత్రం నిజం. చైతు ఇలానే తన స్టైల్ కు సూటయ్యే కథలు ఎంచుకుంటే ఓవర్సీస్ లో కూడా స్ట్రాంగ్ మార్కెట్ ఏర్పరుచుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  
    

Tags:    

Similar News