విడాకులు ఎందుకో చెప్పేసిన మ‌లైకా!

Update: 2019-02-20 02:30 GMT
గ‌త కొంత‌కాలంగా మ‌లైకా అరోరాఖాన్ - అర్జున్ క‌పూర్ ఎఫైర్ గురించి బాలీవుడ్ స‌హా అన్నిచోట్లా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. త‌న‌కంటే ప‌దేళ్లు చిన్న‌వాడితో మ‌లైకా ఎఫైర్ సాగిస్తోంద‌ని మీడియా హైలైట్ చేస్తోంది. ఈ ఎఫైర్ పై స‌ల్మాన్ ఫ్యామిలీ చాలా సీరియ‌స్ గానే ఉన్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌లే ఓ రెస్టారెంట్ లో మ‌లైకా వార‌సుడితో అర్జున్ అత్యంత స‌న్నిహితంగా క‌నిపించ‌డంతో ఈ జంట పెళ్లికి ఇక లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేనంటూ మ‌రోసారి ప్ర‌చారం హోరెత్తిపోయింది. ఆ ఇద్ద‌రి స్నేహంలో డెప్త్ పై యూత్ ప‌దే ప‌దే ఆస‌క్తిగా త‌ర‌చి చూస్తున్నారు.

అదంతా స‌రే.. అస‌లు మ‌లైకా త‌న భ‌ర్త ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోవ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే ఇంత‌కాలం జ‌నాల్లో కొన్ని సందేహాలు నెల‌కొన్నాయి. దానిపై మ‌లైకా స్వ‌యంగా క్లారిటీనిచ్చారు. త‌మ మ‌ధ్య అస్స‌లు సంతోషం అన్న‌దే లేక‌పోవ‌డంతో ఆ ప్ర‌భావం కుటుంబాల పైనా ప‌డింది. ఇరు కుటుంబాలు ఈ విష‌యంలో ఆవేద‌న‌కు గుర‌య్యాయ‌ని మ‌లైకా తెలిపారు. అందుకే తాము విడిపోవాల‌ని భావించామ‌ని, త‌మ వ‌ల్ల ఇత‌రులు బాధ‌ప‌డ‌డం స‌రికాద‌ని అనుకున్నామ‌ని వెల్ల‌డించారు. విడిపోయే ముందు బాగా ఆలోచించుకోమ‌ని త‌న‌కు అంద‌రూ స‌ల‌హా ఇచ్చార‌ని, అయినా విడిపోవాల‌నే అనుకున్నాన‌ని తెలిపారు. క‌రీనా హోస్టింగ్ చేస్తున్న ఓ రేడియో చాట్ కార్య‌క్ర‌మంలో మ‌లైకా వివ‌రంగా అన్ని సంగ‌తులు వెల్ల‌డించారు.

మ‌లైకా చెప్పిన దానిని బ‌ట్టి ఆర్భాజ్- మ‌లైకా గొడ‌వ‌ల వ‌ల్ల ఇరు వైపులా కుటుంబ స‌భ్యులు చాలానే ఇబ్బంది ప‌డ్డార‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఎవ‌రికి వారు స్వేచ్ఛా విహంగాల్లా త‌మ ఇష్టానుసారం జీవిస్తున్నారు. మ‌లైకా త‌న‌కు న‌చ్చిన‌ట్టు జీవిస్తుంటే, అటువైపు ఆర్భాజ్ సైతం త‌న‌కు న‌చ్చిన వేరొక యువ‌తితో బ‌హిరంగంగానే స‌హ‌జీవ‌నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
    

Tags:    

Similar News