ఆ నిర్మాత అలక వీడాడు

Update: 2017-01-23 06:24 GMT
డిసెంబరు 16నే రావాల్సిన సినిమా ‘ఎస్-3’. ఐతే ‘ధృవ’ కోసమని తన సినిమాను వారం వాయిదా వేసుకున్నట్లు చెప్పాడు సూర్య. ఐతే సెన్సార్ ఇబ్బందులు.. డీమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల సినిమా డిసెంబరు 23న కూడా రాలేదు. దీంతో ఈ సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టేసి కూర్చున్న తెలుగు వెర్షన్ నిర్మాత మాల్కాపురం శివకుమార్ అలక పాన్పు ఎక్కారు. సూర్యను తన డబ్బులు తనకిచ్చేయమని డిమాండ్ చేస్తూ.. ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి సిద్ధపడ్డట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని ఆయన ఖండించకపోవడాన్ని బట్టి అది నిజమే అయ్యుండొచ్చు. ఐతే ఎట్టకేలకు జనవరి 26న సినిమా రిలీజవుతుండటంతో అయ్యిందేదో అయ్యిందనుకుని ప్రమోషన్ మొదలుపెట్టాడు శివకుమార్. మీడియాను కలిశాడు.

ఈ సందర్భంగా ‘ఎస్-3’ సినిమా వాయిదాల మీద వాయిదా పడటం గురించి శివకుమార్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఏడాది వందకుపైగా సినిమాలు రిలీజవుతుంటే 30-40 మాత్రమే ఆడుతున్నాయి. మిగతా సినిమాల్లో మంచివి ఉన్నప్పటికీ పరిస్థితుల కారణంగా ప్రేక్షకులకు చేరువ కావడం లేదు. రిలీజ్‌ టైమ్‌ కూడా ఒక్కోసారి ఫలితంపై ప్రభావం చూపిస్తుంది. మా సినిమా డిసెంబర్‌ 16న రిలీజ్‌ కావాల్సింది. డీమానిటైజేషన్.. చెన్నైలో తుఫాను.. ఇతర కారణాలతో వాయిదా పడి ఈ 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రిలీజ్ డేట్ మారుస్తూ పోవడం వల్ల ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. ఐతే ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకముంది. ఇటీవలే ‘ఎస్‌3’ ఫస్ట్‌ కాపీ చూశా. మా సంస్థ నిర్మించిన ‘సూర్య వర్సెస్‌ సూర్య’ తర్వాత అంత సంతృప్తినిచ్చిన చిత్రమిదే. రాజకీయ నేపథ్యమున్న ఓ అంతర్జాతీయ స్మగ్లర్ని నరసింహం ఎలా పట్టుకున్నాడనేది ఈ చిత్ర కథ. ఈ సినిమాను 60 శాతం విశాఖపట్నంలోనే తీశారు. అందుకే ఇది తెలుగు సినిమాలా అనిపిస్తుంది’’ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News