ఆస్కార్ అందుకున్న మంచు లక్ష్మి ఫ్రెండ్

Update: 2016-02-29 17:18 GMT
మంచు లక్ష్మి టాలీవుడ్ లోను, తెలుగు టెలివిజన్ రంగంలోనూ బాగా ఫేమస్. ఇలా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటే ముందు.. మంచు వారసురాలు హాలీవుడ్ లో బాగానే వెలిగింది. టీవీ సీరియల్స్ లోను, హాలీవుడ్ సినిమాల్లోను నటించిన అనుభవం కూడా ఉంది. మంచు లక్ష్మిని మీ జీవిత లక్ష్యం ఏంటి అని అడిగితే.. ఆమె చెప్పే సమాధానం 'ఆస్కార్ అందుకోవడమే' అనే. అయితే.. ఇంకా ఆ గోల్ ను తాను చేరుకోలేకపోయినా.. ఇప్పుడు తన స్నేహితురాలు అందుకోవడంతో బోలెడు సంతోషంగా ఉంది మంచు లక్ష్మి.

హాలీవుడ్ స్టార్ బ్రీ లార్సన్ - మంచు లక్ష్మి మంచి ఫ్రెండ్స్. రూమ్ అనే మూవీలో తల్లిగా ఆమె చేసిన నటనకు గాను ఆస్కార్ అందుకుంది బ్రీ లార్సన్. 'కలలు సాకారం చేసుకోవడం సాధ్యమే అని నిరూపించావు. కంగ్రాట్స్ బ్రీ లార్సన్. నేను చాలా గర్వపడుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది' అంటూ ట్వీట్ చేసిన మంచు లక్ష్మి.. తామిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటోను కూడా పోస్ట్ చేసింది.

బాస్మతీ బ్లూస్ అనే హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి, బ్రీ లార్సన్ కలిసి నటించగా.. ఈ మూవీ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాలో జెనెటిక్ గా మార్పు చేసిన వరి ధాన్యంను కనిపెట్టే సైంటిస్ట్ గా బ్రీ నటించగా.. భారతీయ యువతి సీత పాత్రలో మంచు లక్ష్మి కనిపించింది. వీళ్లిద్దరకూ ఎంత థిక్ ఫ్రెండ్స్ అంటే.. మంచు మనోజ్ పెళ్లికి కూడా వచ్చింది ఈ హాలీవుడ్ నటి.
Tags:    

Similar News