సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘బాహుబలి’. రెండు పార్ట్ లుగా విడుదలైన బాహుబలి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ రేంజ్ పీరియాడిక్ సినిమా మళ్లీ సౌత్ లో రాబోతుంది. ఈసారి మణిరత్నం ఆ భారీ మూవీని తెరకెక్కించబోతున్నాడు. తమిళం మరియు తెలుగులో రూపొందబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్ మరియు ఐశ్వర్యరాయ్ లు నటించబోతున్నారు. బాహుబలి సినిమాలో కట్టప్ప తరహా కీలక పాత్రను అమితాచ్చన్ ఈ చిత్రంలో పోషించనున్నాడని అంటున్నారు.
హీరోయిన్ గా ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ నటించబోతుంది. తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలకు చెందిన పలువురు స్టార్స్ ఈ చిత్రంలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కల్కి కృష్ణమూర్తి రచించిన ఛారిత్రాత్మక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. పొన్నియిన్ సెల్వన్ నవల అయిదు పార్ట్ లుగా వచ్చింది. అయిదు పార్ట్ లను కలిపి మూడు పార్ట్ లుగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఈ చిత్రాన్ని రూపొందించాలని మణి రత్నం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ చిత్రం బడ్జెట్ మరియు ఇతర విషయాల గురించి సంక్రాంతికి మణిరత్నం అధికారిక ప్రకటన చేయబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే పలువురు స్టార్స్ ను మణిరత్నం సంప్రదించాడట. బల్క్ డేట్లు ఇవ్వమంటూ మణిరత్నం కోరుతున్న కారణంగా కొందరు సాధ్యం కాదంటున్నారట. కాని కొందరు మాత్రం చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి ‘బాహుబలి’ రేంజ్ మూవీని మణిరత్నం తీసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.