హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే అని చాలామంది అనుకుంటారు. నటన ఉంటే బోనస్ అని ఫీలవుతారు. వీటన్నిటికీ ఓకే అంటారు గానీ దానితో పాటు వ్యక్తిత్వం అనేది ఉంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్ చూపిస్తేమాత్రం అసలు భరించలేరు. కానీ తాప్సీ లాంటి హీరోయిన్ మాత్రం ఎవరేమనుకున్నా సరే తను అనుకునేవాటిని బయటకు చెప్పేస్తుంది. విమర్శలు ఎదురైనా.. ట్రోలింగ్ బారిన పడ్డా ఏమాత్రం వెనకడుగు వేయదు. రీసెంట్ గా మరో సారి అలాంటి సందర్భమే ఎదురైంది.
తాప్సీ లేటెస్ట్ ఫిలిం 'మన్మర్జియాన్' రీసెంట్ గా రిలీజ్ అయింది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే దక్కలేదుగానీ మంచి రివ్యూస్ క్రిటిక్స్ తో ప్రశంసలు లభించాయి. కానీ సినిమాలో కొన్ని సీన్స్ పై సిక్కు మతానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫిలిం మేకర్స్ లేని పోని వివాదాలు ఎందుకని ఆ సీన్స్ ను సినిమానుండి తొలగించారు. ఈ విషయం తాప్సీ కి నచ్చలేదు. ఇక అదే విషయన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. "ఒకరి మనోభావాలను సెన్సార్ చేయాలనీ నా మతం నేర్పలేదు. మరి మతపరిరక్షకులుగా చెప్పుకునేవారికి ఒక మహిళ ఏం ఆలోచించాలో నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు? ఇక మాట్లాడకుండా ఊరుకుంటే మీకేం కావాలో.. ఏం వద్దో ఎలా తెలుసుస్తుంది.. నేనైతే ఊరుకోను." అని గట్టిగా చెప్పింది.
ఇక ట్రోలింగ్ చేసేవాళ్ళు ఊరుకుంటారా? యాజ్ యూజువల్ గా తిట్టడం మొదలుపెట్టారు. ఒక నెటిజన్ అయితే తాప్సీ వి మడత పడిన పెదాలని.. చీప్ నటి అని విమర్శించాడు. కానీ కొంతమంది మంచి జనాలు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఆ నెటిజన్ కు బుద్ది చెప్పారు.. తాప్సీ మంచి నటి అని 'పింక్'.. 'నామ్ షబానా'.. 'ముల్క్' లాంటి సినిమాలు చూస్తే ఆ విషయం తెలుస్తుందని పిచ్చి పిచ్చి కామెంట్లు చెయ్యొద్దని వెనకేసుకొచ్చారు. పర్వాలేదు. తాప్సీ కి సోషల్ మీడియాలో మంచి సపోర్ట్ ఉంది.