మరాఠి ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తనకు లైంగిక ఎదురైన ఓ సంఘటనను ఒక ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించారు. తాను ఉంటున్న ఇంటి అద్దెను చెల్లించేందుకు ఓనర్ వద్దకు వెళ్లగా ఆ వ్యక్తి తనను డైరెక్ట్ గా రూమ్ లోకి రమన్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారింది.
మరాఠి హీరోయిన్ తేజస్విని పండిట్ నటి జ్యోతి చందేకర్ కుమార్తె. 2004 సంవత్సరంలో కేదార్ షిండే అగా బాయి అరేచాతో తేజస్విని వెండితెరకు పరిచయమైంది. అయితే ఆమె 2009-10 సంవత్సరంలో పుణెలోని సింహగడ్ రోడ్ లోని ఓ ఇంటిలో అద్దెకు ఉన్నట్లు వెల్లడించారు. ఈ సమయంలోనే ఇంటి ఓనర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తాను అపార్ట్ మెంట్లో ఉంటున్న సమయంలో తనవి కేవలం రెండు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయని తెలిపింది. అయితే తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ఓ కార్పొరేటర్ కు చెందినది చెప్పారు. ఈ క్రమంలోనే తాను ఇంటి అద్దెను చెల్లించడానికి అతడి కార్యాలయానికి వెళ్లానని వివరించింది. ఈ క్రమంలోనే అతడు నేరుగా తనను రూమ్ లోకి రమ్మని ఆఫర్ ఇచ్చాడని వాపోయింది.
ఈ సమయంలో అతడి టేబుల్ పై ఒక గ్లాసులో నీరు ఉండగా దానిని తీసుకొని అతడి ముఖంపై కొట్టినట్లు చెప్పింది. తాను అలాంటి పనులు చేయడానికి ఈ వృత్తిలోకి రాలేదని చెప్పి బయటికి వెళ్లిపోయినట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో తన వృత్తి కారణంగా.. ఆర్థికంగా బలహీనంగా ఉండటంతోనే ఆ కార్పొరేటర్ తనతో అలా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె వాపోయింది.
ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ అపార్ట్మెంట్ ను ఖాళీ చేసి వచ్చానని తేజస్విని తెలిపింది. ఈ సంఘటన తన జీవితంలో ఒక అనుభవంగా మిగిలిపోయిందని తేజస్విని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.