ప్రేమకథా చిత్రమ్ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోందేమో అని భ్రమల్లోకి వెళ్లిపోకండి. ప్రేమకథా చిత్రమ్ తరహాలోనే ఓ సినిమాకు దర్శకత్వం మినహా అన్నీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతుండటం విశేషం. నానితో ‘భలే భలే మగాడివోయ్’ చేస్తుండగా.. మధ్యలో తనను కలిసిన దిల్ రాజుకు ఓ లైన్ చెప్పాడట మారుతి. అది బాగా నచ్చి డెవలప్ చేయమనడం.. స్క్రిప్టు పూర్తి చేసి రాజుకు వినిపించగా అతనా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగింది. ఐతే ఈ సినిమాకు మారుతి దర్శకత్వం మాత్రం చేయడట. తన టీమ్ లో పని చేస్తున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడట మారుతి.
ఇంతకుముందు మారుతి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ప్రేమకథాచిత్రమ్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. దానికి దర్శకుడు ప్రభాకర్ రెడ్డి అయినా.. సినిమా సూపర్ హిట్టయ్యాక మొత్తం క్రెడిట్ అంతా మారుతికే వెళ్లింది. ఆ తర్వాత లవర్స్ సినిమాకు కూడా మారుతి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. ఆ సినిమా కూడా బాగానే ఆడింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు మారుతి. ఐతే దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత మారుతితో దర్శకత్వం చేయించుకోకుండా స్క్రిప్టు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నాడో మరి. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత మారుతికి వేరే కమిట్ మెంట్లు కూడా ఏమీ లేనట్లే ఉంది.