ఇటీవల పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ లో వర్షం వస్తుండగా గొడుగు పట్టుకుని ఆవుల వద్ద నిల్చుని ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మార్ఫింగ్ చేశారు. ఒక అభిమాని మాత్రం ఈయన ఆనందంగా ఉంటే మనకు ప్రతి రోజు పండగే అన్నట్లుగా అర్థం వచ్చేలా ఒక పోస్టర్ ను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మారుతి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతి రోజు పండుగే సినిమా లోగోను ఆ పోస్టర్ లో వాడటం జరిగింది.
ఆ పోస్టర్ బాగా వైరల్ అయ్యింది. పవన్ అభిమానులు ప్రతిరోజు పండుగే పోస్టర్ ను తెగ షేర్ చేసుకున్నారు. ఆ పోస్టర్ మారుతి వద్దకు చేరింది. మారుతికి నచ్చిన ఆ పోస్టర్ ను ట్వీట్ చేసి ఇది చాలా నచ్చిదన్నాడు. మారుతి ఆ పోస్టర్ ను ట్వీట్ చేసిన వెంటనే ఒక వ్యక్తి నీ సినిమాల ప్రమోషన్ కోసం మెగా ఫ్యామిలీని.. పవన్ కళ్యాణ్ ను ఎంతగా వాడుకుంటావు అంటూ కామెంట్ పెట్టాడు. అతడి కామెంట్ కు మనసు నొచ్చుకున్న మారుతి తీవ్రంగా స్పందించాడు.
అతడి కామెంట్ పై సీరియస్ గా స్పందించిన మారుతి మొదట తెలుగు సరిగా రాయడం నేర్చుకో అంటూ అతడు చేసిన కామెంట్స్ లోని కొన్ని తెలుగు పదాల తప్పులను సరి చేసి మరీ చూపించాడు. దాంతో అతడు మరింతగా రెచ్చి పోయాడు. నీవు రాసిన దాంట్లో కూడా తప్పు ఉందని ఎదురు దాడికి దిగాడు. చాలా మంది మారుతికి సపోర్ట్ గా కామెంట్స్ చేశారు. మరో వ్యక్తి ఈ పోస్టర్ ను మీరే ఏమైనా డిజైన్ చేశారా అంటూ ప్రశ్నించగా నాకు అంత సమయం లేదంటూ మారుతి సమాధానం ఇచ్చాడు.
సెలబ్రెటీ ట్వీట్స్ కు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే రివర్స్ లో ఎటాక్ చేస్తే ఎక్కువ మంది దృష్టిలో పడవచ్చని.. అలా సోషల్ మీడియాలో పాపులారిటీ పొందవచ్చు అంటూ కొందరు భావిస్తున్నారు. అలాంటి వ్యక్తులు కామెంట్స్ చేస్తే స్పందించడం కంటే అలాంటివి అసలు పట్టించుకోకుండా లైట్ తీసుకోవడం ఉత్తమం. మారుతి కూడా ఇకపై ఇలాంటి కామెంట్స్ కు స్పందించకుంటే బెటర్ అంటూ ఆయన ఫ్యాన్స్ మరియు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.