ప్రస్తుతం ఎక్కువ బజ్ ఉన్న సినిమాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు మీద దర్శకుడు మారుతీ బాగా టెన్షన్ తో ఉన్నాడు. కారణం బాబు బంగారం తర్వాత స్టార్ హీరోను డీల్ చేయటం ఒక కారణం కాగా దీంతో కనక సూపర్ హిట్ కొడితే చిన్న సినిమాలు మాత్రమే బాగా చేయగలడు అనే మార్క్ పోతుంది. మారుతీ తాను ఏ సినిమా దర్శకత్వం వహించినా వాటితో పాటు ఇతర దర్శకులతో బడ్జెట్ మూవీస్ తీస్తూనే ఉంటాడు. కానీ ప్రేమ కథ చిత్రం తర్వాత తీసినవి ఏవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. రోజులు మారాయి కనీస స్థాయిలో ఆడటం అటుంచి విమర్శలు మూటగట్టుకుంది. మొన్న వచ్చిన బ్రాండ్ బాబు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న భలే మంచి చౌక బేరము బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో శైలజారెడ్డి అల్లుడు తర్వాత అమ్మాలని మారుతీ నిర్ణయించుకున్నాడు. ఇలా వేరే దర్శకులతో నిర్మించినవి తనకు ఆర్థికంగా పెద్ద భారం కాకపోయినా బ్రాండ్ పరంగా డ్యామేజ్ చేసేలా ఫలితాలు ఇస్తుండటంతో మారుతీ రూటు మార్చేలా ఉన్నాడు.
ఇకపై చిన్న సినిమాలు తీయనని మారుతీ చెబుతున్నాడు. తాను ఇచ్చిన కథలను దర్శకులు సరైన రీతిలో తెరకెక్కించక పోవడం వల్ల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయని అందుకే ఇకపై వీటికి బ్రేక్ ఇస్తానని చెబుతున్నాడు. అంటే బ్రాండ్ బాబుతో సహా అంతకు ముందు తీసిన వాటి ఫలితాలు తేడా కొట్టడంతో మారుతీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నాడు. బాగానే ఉంది కానీ తప్పంతా దర్శకుల మీదే వేసి తన కథ పర్ ఫెక్ట్ అని మారుతీ చెప్పుకోవడంలో కొంత లాజిక్ మిస్ అవుతోంది. భలే భలే మగాడివోయ్ తర్వాత హీరోకు ఏదో ఒక వీక్ నెస్ పెట్టేసి ఒకే తరహా ఫార్ములాతో కథలు రాసుకుంటున్న మారుతీ ఆ యాంగిల్ లో ఆలోచిస్తే కథలో కూడా ఏదో లోపం ఉందనే విషయం అర్థమైపోతుంది. సో మారుతీ కథకుడుగా నిర్మాతగా పునఃసమీక్ష చేసుకోవాలేమో.